हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest Telugu News: Boiled Oil: భర్తపై మరిగే నూనె పోసి ఆపై కారం చల్లిన భార్య

Vanipushpa
Latest Telugu News: Boiled Oil: భర్తపై మరిగే నూనె పోసి ఆపై కారం చల్లిన భార్య

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కట్టుకున్న భర్త (Husband) పై భార్య కర్కషంగా వ్యవహరించింది. మదన్‌గీర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న దినేష్ (Dinesh)అనే వ్యక్తిపై అతని భార్య అత్యంత కిరాతకంగా దాడి చేసింది. తెల్లవారుజామున భర్త గాఢ నిద్రలో ఉండగా, సలసల మరుగుతున్న నూనెను, ఎర్రటి కారంపొడిని అతని శరీరంపై పోసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దినేష్‌ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం… ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేసే దినేష్ (28) అక్టోబర్ 2న రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. తెల్లవారుజామున 3:15 గంటల ప్రాంతంలో దినేష్‌కు ఒక్కసారిగా తీవ్రమైన మంట, నొప్పి కలగడంతో నిద్ర నుంచి లేచి చూశాడు. అప్పటికే అతని భార్య అతని ముఖం, శరీరంపై మరిగే నూనె పోసింది. తీవ్ర వేదనతో అరుస్తున్న దినేష్ కాలిన గాయాలపై ఆమె ఎర్రటి కారంపొడిని చల్లింది.

Tamilnadu: చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడిని విడుదల చేసిన ఉన్నత ధర్మాసనం

భర్తపై మరిగే నూనె పోసి ఆపై కారం చల్లిన భార్య
భర్తపై మరిగే నూనె పోసి ఆపై కారం చల్లిన భార్య

తరచూ గొడవలతో విసిగిపోయిన భార్య ఈ చర్యలకు పాల్పడింది

నొప్పి తట్టుకోలేక దినేష్ కేకలు వేయడంతో, అతని భార్య గట్టిగా అరిస్తే ఇంకొంచెం నూనె పోస్తానని” బెదిరించింది. దినేష్ అరుపులు విని కింద అంతస్తులో ఉన్న ఇంటి యజమాని కుటుంబ సభ్యులు పైకి వచ్చారు. అయితే, భార్య లోపలి నుంచి తలుపుకు తాళం వేసింది. కొంత సమయం తర్వాత ఆమె తలుపులు తీయగా, తీవ్ర గాయాలతో విలవిలలాడుతున్న దినేష్‌ను చూశారు. వెంటనే ఇంటి యజమాని అతన్ని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం దినేష్‌ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.
దినేష్, అతని భార్యకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె కూడా ఉంది. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కూడా భార్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ తాజా ఘటనపై దినేష్ ఫిర్యాదు మేరకు అతని భార్యపై పలు సెక్షన్ల కింద అంబేద్కర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వరకట్న వేధింపుల చట్టం అంటే ఏమిటి?
“వకట్న వేధింపుల చట్టం” అనేది వరకట్న వ్యవస్థను సూచించే భారతీయ చట్టాలను, ప్రధానంగా వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం మరియు డిమాండ్ చేయడాన్ని నేరంగా పరిగణించే వరకట్న నిషేధ చట్టం, 1961 మరియు భారత శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 498A లను సూచించే విస్తృత పదం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870