📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Crime News: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్‌.. గుట్టు విప్పిన కూతురు

Author Icon By Vanipushpa
Updated: August 7, 2025 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..ఇలాంటి వార్తలే ఇపుడు మీడియాలో ప్రధాన శీర్షికలవుతున్నాయి. ఒకపుడు భార్యను భర్త హత్య చేశాడంటే.. అతన్ని అనేక రకాలుగా మాటలతో హింసించేవారు. కానీ, కాలం మారింది. ఇప్పుడు భర్త తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భార్యతో కాపురం చేయాల్సి వస్తోంది. అవును మరి ప్రియుళ్లతో కలిసి భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలే అందుకు సాక్ష్యం. అలాంటి ఘటనే ఒకటి ఇటీవల చోటు చేసుకుంది. ఓ మహిళ తన లవర్‌తో కలిసి భర్తను చంపేసింది. అంతేకాదు భర్తకు యాక్సిడెంట్ అంటూ కట్టు కథలు అల్లింది. తన తండ్రిని చంపింది తల్లే అని పోలీసులకు చెప్పి సంచలనం సృష్టించింది. దీంతో తల్లితో పాటు ఆమె ప్రియుడు కటకటాల పాలయ్యారు.

Crime News: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్‌.. గుట్టు విప్పిన కూతురు

వివాహేతర సంబంధం చిచ్చు

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబై(Mumbai)కి చెందిన భరత్, రాజశ్రీ (Bharath, Rajasri) భార్యాభర్తలు. వీరి పెళ్లయి 13 ఏండ్లు దాటింది. వీరి దాంపత్యానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు కూతుర్లు, ఇక కుమారుడు ఉన్నాడు. అయితే, అన్యోన్యంగా సాగుతున్న వీరి దాపంత్యంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. భర్త పని వెళ్లడం చూసి రాజశ్రీ కొంతకాలంగా చంద్రశేఖర్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్త భరత్‌ పాటు పిల్లలకూ తెలిసింది. ఈ విషయమై ఆమెను నిలదీశాడు. అయితే తన తప్పులేదని నమ్మించడానికి చంద్రశేఖర్‌ తన వెంటపడుతూ వేధిస్తున్నాడని భర్తకు తెలిపింది. అది నిజమని నమ్మిన భరత్‌ చంద్రశేఖర్‌ కు ఫోన్‌ చేశాడు. తన భార్యను ఎందుకు వేధిస్తున్నావంటూ నిలదీశాడు.

చంద్రశేఖర్‌, రంగాతో కలిసి భరత్‌పై దాడి

అయితే ఇద్దరి మధ్య వాగ్వివాదం చేసుకోవడంతో ‘ఏక్తానగర్, ఆరే కాలనీ, పబ్లిక్ టాయిలెట్ దగ్గరకు రా అక్కడ మాట్లాడుకుందాం’ అంటూ చంద్రశేఖర్‌ భరత్‌ ను రెచ్చ గొట్టాడు. జులై 15న రాత్రి 10 గంటల సమయంలోభరత్‌ ఒక్కడే చంద్రశేఖర్ చెప్పిన చోటుకు వెళ్లాడు. అక్కడికి చంద్రశేఖర్ తన అనుచరుడు రంగాతో కలిసి వచ్చాడు. భరత్‌ మరోసారి చంద్రశేఖర్ ను నిలదీశాడు. దాంతో రెచ్చిపోయిన చంద్రశేఖర్‌, రంగాతో కలిసి భరత్‌పై దాడి చేశారు. అక్కడ కొనసాగుతున్న గొడవ చూసిన జనం వారిని అడ్డుకోవడంతో వారిద్దరూ అక్కడినుంచి పారిపోయారు. స్థానికుల సమచారంతో చంద్రశేఖర్‌ దాడిలో తీవ్రంగా గాయపడ్డ భర్తను రాజశ్రీ ఇంటికి తీసుకెళ్లింది. గాయాలు అయినప్పటికీ ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. మూడు రోజులు చికిత్స చేయించకుండా అలాగే ఇంట్లో ఉంచింది.

పెద్ద కుమార్తె తల్లికి ఊహించని షాక్

అయితే గాయాలతో రోజురోజుకు తండ్రి పరిస్థితి విషమించటంతో పెద్ద కూతురు తన బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. అక్కడికి వచ్చిన బంధువులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి భరత్ చనిపోయాడు. అయితే, ఈ విషయమై పోలీసులు ఆరా తీయగా తన భర్తకు యాక్సిడెంట్‌ జరిగింది. అందులో తీవ్రంగా గాయపడ్డాడని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని రాజశ్రీ పోలీసులకు చెప్పి తప్పించుకో జూసింది. కానీ, భరత్‌ పెద్ద కుమార్తె మాత్రం తల్లికి ఊహించని షాక్ ఇచ్చింది. జరిగిందంతా పోలీసులకు చెప్పింది. ‘మా నాన్నపై చంద్రశేఖర్ అనే వ్యక్తి దాడి చేశాడు. దాడి జరుగుతున్నపుడు నేను అక్కడే ఉన్నాను. నేను, మా అమ్మ 30 మీటర్ల దూరంలో నిలబడి ఉన్నాము. మా నాన్నను కొడుతుంటే అమ్మ వారి దగ్గరకు వెళ్లలేదు. దూరం నుంచే చూస్తూ ఉంది. గాయపడిన నాన్నను ఆస్పత్రికి కాకుండా ఇంటికి తీసుకొచ్చింది’ అని చెప్పింది. అనుమానంతో ఎంక్వరీ చేసినా పోలీసులకు రాజశ్రీ, చంద్రశేఖర్‌ మధ్య ఉన్న సంబంధం బయటపడింది. దీంతో బాలిక స్టేట్‌మెంట్ ఇవ్వటంతో.. పోలీసులు రాజశ్రీ, చంద్రశేఖర్, రంగాలను అరెస్ట్ చేసి రిమాండ్‌ కు తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/lorry-theft-thieves-steal-lorry-empty-it-of-goods-and-escape/andhra-pradesh/527407/

Crime News Daughter Reveals Truth family betrayal Husband Murder India Crime Latest News Breaking News murder investigation shocking crime Telugu News Wife Lover Murder Plot

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.