📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Murder: కారుతో భర్తను తోక్కించిన భార్య

Author Icon By Vanipushpa
Updated: July 15, 2025 • 1:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వివాహేతర సంబంధంకు అడ్డుగా ఉన్నాడన్న కోపంతో తమ్ముడు, తన సన్నిహితుడితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఆదివారం అర్ధరాత్రి యాదాద్రి(Yadadri) భువనగిరి జిల్లా(Bhuvanagir District) మోటకొండూరు మండలం కాటేపల్లి(Katepalli) గ్రామంలో ఈ సంఘటన జరిగింది.ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(38)కిమోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో వివాహంకాగా, ఇద్దరు కుమార్తెలు,కుమారుడు ఉన్నారు. స్వామి భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు వీరబాబుతో కలిసి భువనగిరిలో పనులు ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారి కాటేపల్లిలోని బ్రిడ్జి దాటగానే వెనుకనుంచి వేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టి 50మీటర్ల దూరం ఈడ్చుకువెళ్లింది.దీంతో వస్తువుల స్వామి అక్కడికక్కడే మృతిచెందగా,వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి.గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా, మేరుగైన చికిత్స నిమిత్తం వీరబాబును హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Murder: కారుతో భర్తను తోక్కించిన భార్య

భర్త స్వామిని అడ్డు తొలగించుకునేందుకు కుట్ర
ఈ ప్రమాదంపై తమకు అనుమానం ఉందని, స్వామిని భార్య తరుపువారే హత్య చేసి ఉంటారని స్వామి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్వామి భార్య స్వాతి, బావమరిది మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది.తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ కు చెందిన సాయికుమార్ తో స్వామి భార్యకు కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది..దీంతో భర్త స్వామిని అడ్డు తొలగించుకునేందుకు తమ్ముడు మహేష్,తనతో సన్నిహితంగా ఉండే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి “మండలం పల్లెపహాడ్ కు చెందిన సాయికుమార్ తో కలిసి ప్రణాళిక రూపొందించింది. సాయికుమార్ ఓ కారు అద్దెకు తీసుకువచ్చి స్నేహితుడితో కలిసి కారు నడుపుకుంటూ స్వామి ద్విచక్రవాహనాన్ని
బలంగా ఢీకొట్టాడు.అనంతరం అక్కడే ఉన్న మామిడి తోటలో కారును వదిలేసి పరారయ్యారు. పథకం ప్రకారం సాయికుమార్ అతని స్నేహితుడితో కారులో వచ్చి స్వామి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి హత్యకు పాల్పడ్డారని, రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని చిత్రీకరించడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్వామి బాబాయి అయిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో స్వాతి (ఏ1), మహేష్ (ఏ2)లను పోలీసులు
అదుపులోకి తీసుకోగా, వాహనం నడిపిన, వాహనంలో ఉన్న మరొకరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Saina Nehwal: వివాహ బంధానికి సైనా-కశ్యప్ గుడ్ బై

#telugu News cinema style murder Crime News domestic dispute India crime report murder mystery planned murder shocking crime wife kills husband

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.