📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Murder: పథకం ప్రకారం ప్రియుడితో భర్తను హత్య చేసిన భార్య

Author Icon By Sharanya
Updated: July 24, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అందమైన కుటుంబ జీవితాల్లో అక్రమసంబంధాలు చిచ్చురేపుతున్నాయి. కుటుంబ అనుబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కొందరు తల్లిదండ్రులు చేస్తున్న తప్పిదాలకు అన్నెంపున్నెం ఎరుగని పిల్లలు అనాధలుగా మారుపోతున్నారు. సోనమ్ అనే వధువు తన భర్తను హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకొచ్చి, ప్రియుడితో కలిసి (With boyfriend) హతమార్చింది (Murder). ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్రసంచలనం రేపింది. ఈ ఉదంతం జరిగిన తర్వాత ఇలాంటి ఘటనలే వరుగా ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటుండడం తీవ్రవిచారకరం.

తాజాగా తమిళనాడు (Tamil Nadu)లోని వేలూరు జిల్లా కుప్పంపాళ్యానికి చెందిన ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్త చంపేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భారత్ (36)కు ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన నందిని(26)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమూర్తెలు కూడా ఉన్నారు. భారత్ చెన్నైలో ఓ హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తూ, వారంలో ఒకరోజు ఇంటికి వస్తుండేవాడు. అయితే ఎదురింట్లో ఉండే సంజయ్ (21)అనే యువకుడితో నందిని వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త ప్రవర్తనను మార్చుకోవాలని పలుమార్లు భార్య నందిని హెచ్చరించేవాడు. దీనితో విసుగుచెందిన నందిని ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని అనుకుంది. ప్రియుడితో కలిసి పథకాన్ని రచించింది.

మార్గంలో మాటువేసి హత్య..

ఈనెల 21వ తేదీన భారత్ ఇంటిసరకుల కోసం భార్య, చిన్న కూతురును బైక్పై కూర్చోబెట్టుకుని దుకాణానికి తీసుకెళ్లాడు. పథకంలో భాగంగా మార్గంలో ప్రియుడిని మాటు ఉంచింది నందిని. రోడ్డుపై కొబ్బరిమట్టలు ఉండటంతో వాటిని దాటేక్రమంలో బైక్నుంచి కిందపడ్డారు. ఇదే అదుపుగా భావించిన ప్రియుడు సంజయ్ బైక్పై నుంచి కిందపడ్డ భారత్ను కత్తితో పొడిచి చంపి (Murder), పారిపోయాడు.

మూడేళ్ల కూతురు చెప్పిన సాక్ష్యం

పోలీసులు విచారణలో నందిని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో, మూడేళ్ల చిన్నారిని పోలీసులు ప్రశ్నించారు. తన ఇంటి ఎదురుగా ఉండే సంజయ్ మామ తండ్రిని కొట్టి పారిపోయాడని చెప్పింది. దీంతో హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. సంజయిని, నందిని అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Phonetapping : ఫోన్‌ట్యాపింగ్‌ : దొంగచెవుల దందా

Breaking News latest news lover involved in murder planned murder case Tamil Nadu Telugu News wife murders husband

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.