పశ్చిమ బెంగాల్ (West Bengal)లో మరో దారుణం జరిగింది. కోల్‌కతా సమీపంలోనాలుగేళ్ల చిన్నారిపై గుర్తుతెలియని కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను డ్రైనేజీలో కనుగొన్నారు.
Read Also: Anupama Parameswaran: ఫొటోలు మార్ఫింగ్.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ
ఘటన వివరాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుగ్లీ జిల్లా (Hooghly district) తారకేశ్వర్ ప్రాంతంలో.. రైల్వే షెడ్డు వద్ద తన అమ్మమ్మ పక్కన నాలుగేళ్ల చిన్నారి మంచంపై నిద్రిస్తోంది.ఈ క్రమంలో బాలికను ఓ దండగుడు కిడ్నాప్ చేశాడు. దోమ తెరను కత్తిరించి చిన్నారిని అపహరించాడు. ఈ ఘటన శుక్రవారం (నవంబర్ 7) తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగింది.
చిన్నారి అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది
బాలికను తీసుకెళ్లినట్లు తనకు కొంచెం కూడా తెలియలేదని .. చిన్నారి అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తెల్లారి లేచి చూసేసరికి చిన్నారి కనిపించలేదని తెలిపింది.అనంతరం చిన్నారి కోసం గాలించగా.. ఆ తర్వాత రోజు మధ్యాహ్న తారకేశ్వర్ రైల్వే స్టేషన్ సమీపంలోని డ్రైనేజీలో ఆచూకీ తెలిసిందని పోలీసులు తెలిపారు.
చిన్నారి తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో ఉన్నట్లు వెల్లడించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిననట్లు పోలీసులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: