Vizag Crime News: విశాఖపట్నం నగరంలో దొంగల ముఠా రెచ్చిపోయింది. మధురవాడ పరిధిలోని వివేకానంద కాలనీలో నివసిస్తున్న విశ్రాంత లైన్‌మెన్ అప్పలరాజు ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి అప్పలరాజు తీర్థయాత్రలకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Also: Forced marriage india : బీహార్‌లో కిడ్నాప్ పెళ్లి కలకలం
21 తులాల బంగారం
యాత్ర ముగించుకుని శనివారం ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులకు ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉండటంతో షాక్‌కు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, బీరువా తెరిచి అందులో దాచిన 21 తులాల బంగారం, రూ.6 లక్షల నగదు కనిపించలేదు. దొంగలు వీటిని అపహరించుకెళ్లారని నిర్ధారించుకున్న బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్(Clues Team) సహాయంతో వేలిముద్రలను సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: