విశాఖపట్నం (Visakhapatnam) నగరంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో ఒకటైన యారాడ బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్ర స్నానానికి వచ్చిన ఇటలీ (Italy) పర్యాటకులలో ఒకరు మృత్యువాత పడగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే, ఇటలీకి చెందిన 16 మంది పర్యాటకుల బృందం యారాడ బీచ్‌కు విహారయాత్రకు వచ్చింది.
Fake News: అవాస్తవాలను నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
వీరిలో నలుగురు సముద్రంలో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో అలల ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో వారు నీటిలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన లైఫ్ గార్డులు (Life guards) వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. అతికష్టమ్మీద ఇద్దరిని ఒడ్డుకు చేర్చగలిగారు.ఒడ్డుకు చేర్చిన ఇద్దరికీ లైఫ్ గార్డులు వెంటనే సీపీఆర్ చేశారు.
మిగతా ఇద్దరి ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు
వారి ప్రయత్నం ఫలించి ఒక పర్యాటకుడు ప్రాణాలతో బయటపడగా, మరొకరు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గల్లంతైన మిగతా ఇద్దరి ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నారు.యారాడ బీచ్ (Yarada Beach) లో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు.
గతంలో కూడా చాలామంది పర్యాటకులు అలల ధాటికి సముద్రంలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా గత ఏడాది సెప్టెంబర్‌లో కూడా 8 మంది ఇటలీ పర్యాటకులు ఇలాగే సముద్రంలో కొట్టుకుపోగా, లైఫ్ గార్డులు సకాలంలో స్పందించి వారందరినీ సురక్షితంగా కాపాడారు. ఈ తాజా ఘటనతో యారాడ తీరంలో భద్రతా చర్యలపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: