Vijayawada: పెళ్లి అనే బంధంపై ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన ఒక యువతికి చేదు అనుభవం ఎదురైంది. భర్త సంసారానికి పనికిరాడనే నిజాన్ని దాచిపెట్టి, భారీగా కట్నకానుకలు తీసుకుని పెళ్లి చేసిన వైనం విజయవాడలో కలకలం రేపింది. చివరకు న్యాయం కోసం ఆ నవవధువు పోలీసులను ఆశ్రయించింది.
Read Also:Bhadreshkumar Patel: భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు
ఘటన వివరాలు
నంద్యాలకు చెందిన ఒక యువతి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తోంది. ఈమెకు గతేడాది డిసెంబర్ 26న కడప జిల్లాకు చెందిన, విజయవాడలో ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు రూ. 15 లక్షల నగదుతో పాటు 5 తులాల బంగారం, ఇతర వస్తువులను కట్నంగా ఇచ్చారు.
అసలు నిజం బయటపడిందిలా
పెళ్లి జరిగిన మూడు నెలలైనా భర్త ఆమెతో సంసారం చేయకుండా ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. రాత్రిళ్లు ఇంటికి రాకుండా తప్పించుకు తిరుగుతుండటంతో బాధితురాలు అతడిని నిలదీసింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులకు సేవ చేయడానికే పెళ్లి చేసుకున్నానని భర్త సమాధానం చెప్పడం గమనార్హం. లోతుగా విచారించగా, తన భర్త నపుంసకుడని, ఆ విషయాన్ని దాచిపెట్టి తనకు అన్యాయం చేశారని ఆమె తెలుసుకుంది.
ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా, నిందితులు తమ తప్పు ఒప్పుకోకపోగా.. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. అంతేకాకుండా ఆమెను ఇంటి నుండి బయటకు గెంటివేశారు. దీంతో బాధితురాలు గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: