हिन्दी | Epaper
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Latest News: Vijay: టీవీకే పార్టీ అధినేత ఇంటికి బాంబు బెదిరింపు

Anusha
Latest News: Vijay: టీవీకే పార్టీ అధినేత ఇంటికి బాంబు బెదిరింపు

చెన్నై నగరంలో ప్రముఖ తమిళ నటుడు, తమిళ వెట్రి కళగం (టీవీకే) పార్టీ (TVK Party) అధ్యక్షుడు విజయ్ (Vijay) నివాసానికి వచ్చిన బాంబు బెదిరింపు వార్తతో నగరం ఆందోళనకు గురైంది. ఓ ఆగంతుకుడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి, భవిష్యత్తులో విజయ్ ఎక్కడైనా బహిరంగ సభ నిర్వహిస్తే ఆయన ఇంటి దగ్గర బాంబు ఉంచుతానని హెచ్చరించాడు.

IPS: సీనియర్ల వేధింపుల కారణంతోనే IPS ఆఫీసర్‌ ఆత్మహత్య

ఈ బెదిరింపు సమాచారం వెలువడగానే, స్థానిక పోలీసులు, నీలాంగరై ప్రాంతంలోని విజయ్ (Vijay) నివాసానికి గట్టి భద్రత ఏర్పాటు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం, కన్యాకుమారి నుంచి ఓ వ్యక్తి అత్యవసర నంబర్ 100కు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవలే కరూర్‌లో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన విషాద ఘటన నేపథ్యంలో ఈ బెదిరింపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Vijay
Vijay

ప్రస్తుతం పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.మరోవైపు కరూర్ ఘటన తర్వాత విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మృతుల కుటుంబసభ్యులకు వ్యక్తిగతంగా వీడియో కాల్స్ (Video calls) చేస్తూ పరామర్శిస్తున్నారు. “నేను మీకు అండగా ఉన్నాను” అని వారికి భరోసా ఇస్తూ, త్వరలోనే నేరుగా కలుస్తానని హామీ ఇచ్చారు.

ఆర్థిక సహాయం అందిస్తానని కూడా ఆయన ప్రకటించారు

మృతుల కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సహాయం అందిస్తానని కూడా ఆయన ప్రకటించారుఅయితే, ఈ ఘటనపై విజయ్ న్యాయపరమైన చిక్కులను కూడా ఎదుర్కొంటున్నారు. తొక్కిసలాట జరిగిన తర్వాత విజయ్ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారని మద్రాస్ హైకోర్టు (Madras High Court) విమర్శించింది.

ఈ ఘటనపై కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT) పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ విజయ్ (Vijay) పార్టీ సుప్రీంకోర్టు (Supreme Court) ను ఆశ్రయించింది. కాగా, ఈ దుర్ఘటనపై సీబీఐ విచారణ జరపాలని మృతులలో ఒకరైన 13 ఏళ్ల బాలుడి తండ్రి పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం..

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870