📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Uttar Pradesh: మూఢనమ్మకంతో మేనల్లుడిని చంపిన మేనమామ

Author Icon By Anusha
Updated: August 3, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో 9 ఏళ్ల ఆరుష్ గౌర్ అనే చిన్నారి దారుణ హత్య మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసింది. అంధవిశ్వాసం, మంత్రాల మాయలో పడి, సొంత బంధువులే ఈ ఘోర నేరానికి పాల్పడటం స్థానిక ప్రజలను షాక్‌కు గురి చేసింది. తాంత్రిక పూజలు చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నమ్మిన నిందితులు, అమాయక ప్రాణాన్ని బలితీసుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.2024లో దేవరియా జిల్లా భలువాని పత్ఖౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పరశురామ్ గౌర్ కుమార్తె శంభాను ఇంద్రజిత్ గౌర్ (Indrajit Gaur) వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత అతను తన అత్తమామల ఇంటికి వెళ్ళిపోయాడు. అతనికి దేవత ఆవహించిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. అతను అనారోగ్యానికి గురయ్యాడు. దీని గురించి అతని అత్తమామలు ఆందోళన చెంది, భూతవైద్యం కోసం సోఖాకు తీసుకెళ్లారు. అక్కడ తాంత్రికుడు నరబలి ఇవ్వడంతో రోగం నయమవుతుందని చెప్పాడు.

వివాహం తర్వాత అనారోగ్యం – తాంత్రికుడి మంత్రాల వలలో బంధువులు

దీంతో రాత్రిపూట తోటలో పూజలు నిర్వహించి తొమ్మిదేళ్ల బాలుడిని కత్తితో గొంతు కోసి చంపారు. మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టారు.అయితే ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన నిందితుడు సోఖా ఇంద్రజిత్, భీమ్ గౌర్ లతో కలిసి మృతదేహాన్ని బయటకు తీశారు. దానిని ఒక సంచిలో వేసి పికప్ వాహనంలో తీసుకెళ్లి బర్హాజ్‌లోని గౌరాఘాట్ (Gauraghat) వద్ద నదిలో విసిరేశారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 17న, తన మేనల్లుడు ఆరుష్ గౌర్ అదృశ్యం గురించి, సోమనాథ్ గౌర్ ఏప్రిల్ 17న ఒక ఫిర్యాదు దాఖలు చేశారని డియోరియా ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. ఈ కేసులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

Uttar Pradesh

అమాయక ప్రాణం దారుణంగా బలి

ఈ కేసులో ప్రధాన నిందితులుగా జైప్రకాష్ గౌర్, ఇంద్రజిత్ గౌర్, భీమ్ గౌర్, రామశంకర్ అలియాస్ శంకర్ గౌర్ తోపాటు బాలుడి దగ్గరి బంధువులు ఉన్నారని పోలీసు దర్యాప్తులో తేలింది. వారంతా బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత నిందితులు అమాయక బాలుడిని బలి ఇచ్చారు. మృతదేహాన్ని నదిలో పడేశారు. పోలీసుల విచారణలో నలుగురు నిందితులు నేరం అంగీకరించారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను రిమాండ్‌కు తరలించారు.

ఉత్తరప్రదేశ్‌ రాజధాని ఏమిటి?

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నో (Lucknow).

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి?

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 75 జిల్లాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/delhi-out-on-bail-accused-opens-fire-on-rape-victim/national/525090/

black magic killing Breaking News child sacrifice case Deoria shocking murder human sacrifice news latest news tantrik rituals India UP crime news Uttar Pradesh latest crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.