Uttar Pradesh Crime: ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో, ఒక మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే అతి దారుణంగా హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Also: Vizianagaram Road Accident: కారు బోల్తా పడి యువకుడు దుర్మరణం!
ఏకాంతంగా ఉండగా చూశాడని ఘాతుకం
ఈ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త రావడంతో గొడవ జరిగిందని, ఇద్దరూ కలిసి అతడిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీశారని విచారణలో తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: