Uttar Pradesh: హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

Read Time:  1 min
Uttar Pradesh
Uttar Pradesh
FONT SIZE
GET APP

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత దారుణమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మతం మార్చుకుని, తప్పుడు గుర్తింపుతో యువతులను మోసగిస్తూ సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్న ఒక ముఠా ఆగడాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Read also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

Uttar Pradesh: Hundreds of young women raped while posing as Hindus
Uttar Pradesh: Hundreds of young women raped while posing as Hindus

అసలేం జరిగింది?

అజఫరుల్ హక్ అనే వ్యక్తి తన పేరును ‘ప్రిన్స్’ అని, తాను హిందువునని నమ్మబలికి పలువురు యువతులతో పరిచయాలు పెంచుకున్నాడు. ప్రేమ, పెళ్లి పేరుతో వారిని నమ్మించి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.

వంద మందికి పైగా బాధితులు?

బాధితురాలు అందించిన సమాచారం ప్రకారం, నిందితుడు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. కేవలం తననే కాకుండా, సుమారు 100 మందికి పైగా యువతులను ఇదే రీతిలో ట్రాప్ చేసి వేధించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు అజఫరుల్ హక్‌ను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్‌లో సంబంధం ఉన్న మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.