ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని లక్నోలో చోటుచేసుకున్న ఒక విషాదకర సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లక్నో సమీపంలోని మోహన్‌లాల్‌గంజ్ ప్రాంతంలో ఉన్న బీఐపీఎస్ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న 12 ఏళ్ల యశ్ కుమార్ తన ప్రాణాలను తీసుకోవడం స్థానికులను కుదిపేసింది. ఈ చిన్నారి అకస్మాత్తుగా ఇలా చేయడం కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారిని షాక్‌కు గురిచేసింది.
కొంత వ్యవసాయ భూమిని అమ్మి వచ్చిన మొత్తంలో
యశ్ కుమార్ తండ్రి సురేష్ కుమార్ యాదవ్ ఒక పెయింటర్‌గా రోజువారీ కూలి చేసి జీవనం సాగిస్తున్నాడు.రెండు సంవత్సరాల క్రితం కుటుంబానికి చెందిన కొంత వ్యవసాయ భూమిని అమ్మి వచ్చిన మొత్తంలో దాదాపు 13 లక్షల రూపాయలను బ్యాంకులో జమ చేశారు.ఈ క్రమంలోనే ఇటీవల బ్యాంకుకు వెళ్లిన సురేష్ కుమార్ యాదవ్ (Suresh Kumar Yadav)..
బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేయించాడు. అందులో డబ్బులు మొత్తం ఖాళీ కావడం చూసి అవాక్కయ్యాడు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చి.. ఏం జరిగిందని ఎంక్వైరీ చేయగా.. రూ.13 లక్షలు ఆన్‌లైన్ గేమ్ ఆడినందుకు పలు ట్రాన్సాక్షన్ల ద్వారా ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
ఆ బాలుడు మొదట చెప్పలేదు
దీంతో తమకు ఉన్న ఒకే ఒక్క కొడుకు యశ్ కుమార్‌పై సురేష్ కుమార్ యాదవ్‌కు అనుమానం వచ్చి అడగ్గా.. తనకేమీ తెలియదని ఆ బాలుడు మొదట చెప్పలేదు.అయితే ఆ తర్వాత.. అసలు విషయం చెప్పాడు. తాను ఫోన్‌లో ఫ్రీ ఫైర్ అనే గేమ్ (Free fire game) ఆడానని.. అందులో ఈ డబ్బు అంతా పోగొట్టుకున్నట్లు వెల్లడించాడు.
అది తెలిసి అతని తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అయితే డబ్బులు పోగొట్టినందుకు యశ్ కుమార్‌ను అతడి తండ్రి సురేష్ కుమార్ ఏమీ అనలేదు. పైగా.. భయంతో ఉన్న కుమారుడికి ధైర్యం చెప్పాడు. ఇక యశ్ కుమార్ (Yash Kumar) ట్యూషన్ టీచర్ కూడా అతడికి ధైర్యం చెప్పారు.
యశ్ కుమార్ తల్లి విమల స్పృహ తప్పి పడిపోయింది
ఈ ఘటన జరిగిన తర్వాత యశ్ కుమార్.. తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. అయితే ఎంతకూ యశ్ కుమార్ గది నుంచి బయటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించడంతో.. షాక్ అయ్యారు. హుటాహుటిన యశ్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు.
ఇక తమకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇలా ప్రాణాలు తీసుకోవడంతో.. ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. కుమారుడి మరణ వార్త విని.. యశ్ కుమార్ తల్లి విమల స్పృహ తప్పి పడిపోయింది. అతని సోదరి గుంజన్ కన్నీరుమున్నీరుగా విలపించడం చూసి.. స్థానికులే కంటతడి పెట్టారు. యశ్ కుమార్ మృతికి సంతాపంగా.. బీఐపీఎస్ స్కూల్ యాజమాన్యం సెప్టెంబర్ 16వ తేదీన సెలవును ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: