Health Benefits: నువ్వులు (sesame) మన వంటింట్లో సాదారణంగా కనిపించే విత్తనాలు అయినప్పటికీ, వీటి లోని పోషక విలువలు అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, మగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిచ్చి, శ్రమ తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి.
Read also: Amla: ఖాళీ కడుపుతో ఉసిరి తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
Health Benefits: నువ్వులతో ఎన్ని లాభాలో తెలుసా?
ఎముకల బలాన్ని పెంచుతాయి
Health Benefits: ప్రతి రోజు కొద్దిగా నువ్వులు ఆహారంలో చేర్చడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వీటిలో ఉండే “హెల్తీ ఫ్యాట్స్” హైబీపీ, హై కొలెస్ట్రాల్, మరియు షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అదేవిధంగా, ఎముకలకు అవసరమైన కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకల బలాన్ని పెంచుతాయి. నిపుణుల ప్రకారం, నువ్వులను నిరంతరం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి, మెటబాలిజం సక్రమంగా పనిచేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: