हिन्दी | Epaper
ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

UPCrime: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Pooja
UPCrime: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ఉత్తరప్రదేశ్‌లోని(UPCrime) సంభాల్ జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా మారాడన్న కోపంతో ఓ భార్య అతడిని అమానుషంగా హత్య చేసింది. ఈ హత్యలో ఆమెకు ప్రియుడు సహకరించడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.

Read Also: HYD Crime: ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సంభాల్‌కు చెందిన రాహుల్ (38) డిసెంబర్ 15 నుంచి అదృశ్యమయ్యాడు. భర్త కనిపించకపోవడంతో అతడి భార్య రూబీ పోలీస్(UPCrime) స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. మొదట ఇది సాధారణ అదృశ్య కేసుగా పోలీసులు భావించినప్పటికీ, అదే రోజు ఓ మురికి కాలువలో గుర్తు తెలియని శవం లభించడంతో కేసు మలుపు తిరిగింది. కాలువలో లభించిన మృతదేహానికి తల, చేతులు, కాళ్లు లేకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ ఆధారాలు, స్థానికుల సమాచారంతో విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో రూబీ ప్రవర్తనపై అనుమానం పెరగడంతో ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.

UPCrime
UPCrime

విచారణలో రూబీ నిజాన్ని ఒప్పుకుంది. ప్రియుడు గౌరవ్‌తో ఉన్న సమయంలో భర్త రాహుల్ వారిని మందలించడంతో తీవ్ర కోపం వచ్చిందని తెలిపింది. అదే కోపంతో ఇద్దరూ కలిసి ఐరన్ రాడ్లతో రాహుల్‌పై దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించింది. అనంతరం నేరం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలుగా చేసి కాలువలో పడేసినట్లు చెప్పింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు ఎలా ధ్వంసమవుతున్నాయో ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది. పోలీసులు రూబీ, గౌరవ్ ఇద్దరినీ అరెస్ట్ చేసి హత్య కేసుతో పాటు ఆధారాలు నాశనం చేసిన నేరాల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870