📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

UP News: ఉన్నావ్ అత్యాచార కేసు మళ్లీ చర్చల్లోకి

Author Icon By Radha
Updated: December 24, 2025 • 6:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌లోని(UP News) ఉన్నావ్ అత్యాచార కేసులో మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు విధించిన జీవిత ఖైదు శిక్షను సస్పెండ్ చేయడంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) ఇచ్చిన ఈ తీర్పు న్యాయసూత్రాలకు విరుద్ధమని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తమ కుటుంబానికి ఈ నిర్ణయం మరింత మానసిక వేదనను కలిగించిందని ఆమె తెలిపారు.

Read also: Parthasarathy: ఏపీ పెట్టుబడులపై కేసీఆర్ వ్యాఖ్యలు.. మండిపడ్డ మంత్రి

Unnao rape case back in the discussions

“మమ్మల్ని ఒకొక్కరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు” – బాధితురాలి వాపు

ఈ ఘటనపై బాధితురాలు కూడా తన భయాన్ని, ఆవేదనను బహిరంగంగా వెల్లడించారు. తండ్రి, అత్తను అనుమానాస్పదంగా హత్య చేసిన తర్వాత ఇప్పుడు తానే లక్ష్యంగా మారానని ఆమె వాపోయారు. శిక్షను సస్పెండ్ చేయడం వల్ల నిందితుడి ప్రభావం మళ్లీ పెరిగి, తమ భద్రత ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ తమకు అండగా నిలవకపోతే బాధితులకు రక్షణ ఎలా ఉంటుందన్న ప్రశ్నను ఆమె లేవనెత్తారు.

2017 ఘటన నేపథ్యం: దేశాన్ని కుదిపిన కేసు

UP News: 2017లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో కుల్దీప్ సింగ్ సెంగర్ దోషిగా తేలారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించగా, అది బాధిత కుటుంబానికి కొంత ఊరటనిచ్చింది. అయితే ఇప్పుడు అదే శిక్షను సస్పెండ్ చేయడం వల్ల మళ్లీ న్యాయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం మహిళల భద్రత, బాధితుల హక్కులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలువురు సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిశీలించి న్యాయసమ్మతమైన తీర్పు ఇవ్వాలనే డిమాండ్ రోజురోజుకీ బలపడుతోంది.

ఉన్నావ్ కేసులో నిందితుడు ఎవరు?
మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్.

కోర్టు తీసుకున్న తాజా నిర్ణయం ఏమిటి?
జీవిత ఖైదు శిక్షను ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Delhi High Court justice for victims Kuldeep Singh Sengar Supreme Court Intervention Unnao Rape Case women safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.