UP crime: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా(Moradabad)లో చోటుచేసుకున్న పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. వేర్వేరు మతాలకు చెందిన మహమ్మద్ అర్మాన్, కాజల్ గత రెండేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఆదివారం రాత్రి కాజల్ ఇంట్లో ఇద్దరూ కలిసి ఉన్నట్లు ఆమె సోదరులు గమనించడంతో ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే వారిద్దరిపై దాడి చేసి, కిరాతకంగా పారతో నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Read also: TG: మెదక్ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన కొడుకు
పరువు హత్య కేసు.. ఒకరు అరెస్ట్
అనంతరం మృతదేహాలను సమీపంలోని నది తీరంలో పాతిపెట్టినట్లు సమాచారం.
అర్మాన్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో ఈ ఘోర నేరం వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని, మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: