📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Latest News: UP: తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో, నలిగి ప్రాణాలు కోల్పోయిన పసికందు

Author Icon By Anusha
Updated: December 11, 2025 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తర ప్రదేశ్‌ (UP) లోని అమరోహా జిల్లా సిహాలి జాగీర్‌ గ్రామంలో చోటుచేసుకున్న ఓ ఘటన అందర్నీ కలిచివేసింది. నెల రోజులు కూడా నిండని పసికందును తమ పక్కనే పడుకోబెట్టుకుని మురిసిపోయారు తల్లిదండ్రులు. తెల్లారి లేచి చూసేసరికి తల్లిదండ్రుల మధ్య నలిగి చిన్నారి మరణించాడు.

Read Also: AP Crime: నకిలీ మద్యం కేసులో గోవా వ్యాపారి బాలాజీకే అధిక చెల్లింపులు

యూపీ (UP)లోని సిహాలి జాగీర్ గ్రామంలోనే మొక్కల నర్సరీ నడుపుకుంటున్న సద్దామ్, ఆస్మా దంపతులకు ఏడాది క్రితం వివాహం జరిగింది. గత నెలలోనే ఆస్మా పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది. అయితే పుట్టిన వెంటనే చిన్నారికి శ్వాస సమస్య తలెత్తడంతో వైద్యులు కొద్ది రోజులు ఆ బిడ్డను పర్యవేక్షణలో ఉంచారు. పరిస్థితి మెరుగైన తర్వాత దంపతులు బిడ్డను ఇంటికి తీసుకొచ్చారు.

కానీ దురదృష్టవశాత్తు కొద్ది రోజులకే మళ్లీ బుజ్జాయికి కామెర్లు రావడంతో మరోసారి చికిత్స చేయించారు. అది తగ్గాక.. చిన్నారికి నామకరణం కూడా చేశారు. తెగ మురిసిపోతూ ఉయ్యాలలో వేశారు. సంబురంగా ఫంక్షన్ ముగించుకున్న వీళ్లు బాబు భవిష్యత్తు గురించి ఎన్నెన్నో ఊసులాడుకున్నారు. అంతా సవ్యంగా జరుగుతోందని దంపతులు సంతోషంగా గడిపారు.

UP: Baby crushed to death due to parents’ negligence

కుటుంబ సభ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు

గత శనివారం రాత్రి సద్దామ్, ఆస్మా దంపతులు తమ బాబును తమ ఇద్దరి మధ్యలో పడుకోబెట్టుకున్నారు. మధ్య రాత్రిలో వారి మధ్య ఇరుక్కుపోయాడు. ఊపిరి తీసుకోవడానికి గాలి ఆడకపోవడంతో.. చిన్నారి నిద్రలోనే మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఆస్మా నిద్రలేచి, బిడ్డకు పాలు తాగించాలని చూసింది.

అయితే చిన్నారిలో కదలిక లేకపోవడం చూసి ఆమె షాక్ అయింది.. వెంటనే ఆందోళనతో గజ్రౌలా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువెళ్లినా అప్పటికే ప్రయోజనం లేకపోయింది.డాక్టర్లు ఆ చిన్నారి మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో, కుటుంబ సభ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Amroha district infant death latest news Sihali Jagir village Telugu News Tragic Incident Uttar Pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.