పిల్లలు దేవుని స్వరూపమని అంటారు. ఎవరికీ ఎలాంటి కీడుతలపెట్టని పసితనం చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది. వారిని దగ్గరకు చేర్చుకుని, ముద్దాడాలనిపిస్తుంది. వారితో కలిసి కేరింతలు ఆడాలనిపిస్తుంది. అలాంటి పసిపిల్లల పట్ల కర్కశంగా ప్రవర్తించే దుర్మార్గులు లేకపోలేదు. అల్లరి చేస్తుందని ఏడేళ్ల బాలికను హతమార్చారు మేనమామ, అత్త. హైదరాబాద్(Hyderabad) లోని మాదన్నపేటలో ఈ దారుణం జరిగింది.
Read Also: Telangana: కష్టాల్లో మొక్కజొన్న రైతు
ఆస్తి తగాదాలే కారణమా?
బాలిక తల్లితో కొంతకాలంగా ఆస్తి తగాదాలు జరుగుతున్న నేపథ్యంలో, తరచూ బాలిక అల్లరి చేస్తుందని ఈ దారుణానికి ఒడిగట్టారు దుర్మారుగలు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు చేసిన విచారణలో ఈ దారుణం బయటపడింది. దీంతో పోలీసులు వెంటనే బాలిక మేనమా, అత్తను అరెస్టు చేసి, జైలుకు తరలించారు. పిల్లలు అల్లరి చేస్తే, వారిని సముదాయించాలి.. లేదా వారిని క్రమశిక్షణలో(discipline) పెట్టేందుకు ప్రయత్నించాలే తప్ప ఇలాంటి దారుణాలకు పాల్పడతారా అంటూ బాలిక కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.
నేరానికి కారణం ఏమిటి?
బాలిక తల్లితో ఆస్తి తగాదాలు ఉన్న కారణంగా, అలాగే బాలిక అల్లరి చేస్తుందని కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
నిందితులపై ఏ చర్యలు తీసుకున్నారు?
పోలీసులు విచారణ అనంతరం బాలిక మేనమామ, అత్తను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: