📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Latest News: TG Crime: అప్పుల ఒత్తిడి తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య

Author Icon By Aanusha
Updated: November 4, 2025 • 10:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంగారెడ్డి జిల్లా (Sangareddy District) లో చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికులను కలచివేసింది. యువ కానిస్టేబుల్‌ జీవితం ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనానికి బలైపోయింది. ఆ గేమ్స్ మోజు చివరికి అతని ప్రాణాలను తీసింది. అప్పుల ఊబిలో చిక్కుకుని మానసికంగా కుంగిపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం చుట్టుపక్కల వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Read Also: Vizianagaram: మద్యం కోసం భార్యపై ఆగ్రహం.. ప్రాణాలు తీసుకున్న భర్త!

వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.  కల్హేర్ మండలానికి చెందిన కొటారి సందీప్ కుమార్ (25) సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

2024 బ్యాచ్‌కు చెందిన సందీప్ కుమార్ కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. వాటి కోసం బంధువులు, స్నేహితుల వద్ద లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పులు తీర్చాలంటూ వారి నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో తట్టుకోలేకపోయాడు.

వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి

ఈ క్రమంలోనే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి పదిహేనేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించగా, సందీప్‌కు తల్లి, చెల్లి ఉన్నారు. అతడికి ఇంకా వివాహం కాలేదు.ఆత్మహత్యకు ముందు సందీప్ ‘వెల్ విషర్స్’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ (WhatsApp Group) క్రియేట్ చేసి అందులో సూసైడ్ నోట్ పెట్టడం అందరినీ కలచివేసింది.

TG Crime

“అమ్మా.. చెల్లీ నన్ను క్షమించండి. నేను ఉన్నన్ని రోజులు మీకు నరకం చూపించా. నేను ఇంకా ఉంటే మీరు బాధపడుతూనే ఉంటారు. దయచేసి మా అమ్మను, చెల్లిని ఎవరూ ఏమీ అనకండి” అని అందులో ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, సందీప్ ఆత్మహత్యకు ఉపయోగించిన రివాల్వర్ ఎక్కడిది అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీస్ స్టేషన్‌లోని స్టోర్ రూమ్ నుంచి ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లాడా? లేక విధి నిర్వహణలో భాగంగా ఉన్నతాధికారులు ఇచ్చిందా? అనే కోణంలో సీఐ రమేష్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. చట్టాన్ని రక్షించాల్సిన ఓ యువ పోలీసు అధికారి ఇలా వ్యసనం బారిన పడి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

constable Sandeep Kumar latest news online gaming addiction Sangareddy constable suicide Telangana police news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.