📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: TTD: మరింత లోతుగా అప్పన్నకు సిట్ ప్రశ్నలు

Author Icon By Rajitha
Updated: November 19, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD:తిరుమల : తిరుమల లడ్డూల తయారీకి కల్తీనెయ్యితో సరిపెట్టుకున్నారని బలమైన ఆరోపణలపై సిబిఐ సిట్ అధికారులు మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నఅప్పన్నను కస్టడీలో విచారణ చేశారు. రెండవరోజు మంగళవారం అలిపిరి సిట్ కార్యాలయం మరికొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టినట్లు టిటిడి (TTD) వ్యవహారాల్లో ఎవరు కలగజేసుకోమన్నారు, నెయ్యి సరఫరా చేసిన డెయిరీలతో పిఎగా నీకు ఎలాంటి అర్హత ఉంది, భారీగా నగదు ఎలా వచ్చింది అనే కోణంలో వివరాలు రాబట్టారని, కొన్నిటికి సమాధానాలు దాటవేశాడనేది తెలుస్తోంది. ఇప్పటికే ఈ తెలిసింది. కేసులో నలుగురు ప్రధాన నిందితులు తమిళనాడు ఏఆర్ డెయిరీ ఎండి రాజశేఖరన్, నెయ్యిసరఫరా దారులు ఉత్తరప్రదేశ్లోని పరాగ్లైడెయిరీ, ప్రీమియర్ అగ్రిపుడ్స్, అల్పామిల్క్ వుడ్స్, ఉత్తరాఖండ్ రూర్కే బోలేబాబాడైరీకి చెందిన అప్పటి డైరెక్టర్లు విపినైన్, షోమిలైజైన్, వైష్ణవీడైరీ (పెనుబాక) సిఇఒ అపూర్వ సిట్ నాలుగునెలల క్రిందటే అరెస్టుచేసిన విషయం విదితమే.

Read also: Annadata Sukhibhava – PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. నేడే ఖాతాల్లోకి డబ్బులు

SIT questions Appanna in more depth

సిట్ అధికారులు లోతుగా విచారణ సాగించినట్లు

TTD: వారినుండి రాబట్టిన కీలక సమాచారంతో అప్పన్న వైవి సుబ్బారెడ్డి చెబితే కల్తీనెయ్యి వ్యవహారంలో తలదూర్చాడనేది సిట్ వద్ద ఆధారాలు. కొందరు టిటిడి మార్కెటింగ్, కొనుగోళ్ళ ఉద్యోగులను సిట్ అధికారులు లోతుగా విచారణ సాగించినట్లు తెలిసింది. 2020-24 మధ్య కాలంలో వైవి వ్యవహారాలను చక్కబెట్టడం, లావాదేవీలు, ఆర్థికపరమైన అంశాల్లో కీలకంగా వ్యవహరిOచాడనేది సిట్ వద్ద ఉన్న సమాచారం. దానిమేరకు ఇప్పుడు పలుకోణాల్లో విచారణలో కొన్ని వాటికి సమాధానం చెప్పడంలేదనేది తెలిసింది. అప్పన్న ఖాతాలో పెద్ద మొత్తంలో ఆర్థికలావాదేవీలపై ప్రధానంగా దృష్టి సారించింది. కల్తీనెయ్యి కొనుగోలుచేసిన వ్యవహారంలో ప్రస్తుతం మాజీలుగా ఉన్న టిటిడిలో పనిచేసిన కీలక నేతలు, అధికారులను నేటి నుండి విచారణ చేయనుంది. త్వరలోనే సిట్ అధికారులు గత బోర్డులో కొనుగోళ్ళ కమిటీ సభ్యులను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. సిబిఐ డిఐజి మురలీరాం నేతృత్వంలోని తిరుపతి అడిషనల్ ఎస్పీ వెంకట్రావు, డిఎస్పీలు, సిఐలు అసలు సూత్రధారులను పట్టుకునే దిశగా సిద్దమవుతున్నారు. త్వరలోనే ఈ కేసు క్లైమాక్స్ కు తీసుకురానున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

CBI Ghee Scam latest news SIT Telugu News tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.