📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Sandalwood: తిరుపతి టూ ఢిల్లీ ఎర్ర చందనం స్మగ్లింగ్

Author Icon By Saritha
Updated: October 14, 2025 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ఎపి, ఢిల్లీ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో భారీగా ఎర్రచందనం(Sandalwood) నిల్వలను పట్టుకున్నామని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ కథనాన్ని నిర్ధారిస్తూ ఎపి డిజిపి హరిష్కుమార్ గుప్తా కార్యాలయంనుంచి ఒక ప్రకటన విడుదల చేసారు. ఢిల్లీలో తుగ్లకా బాద్లోని గోదాములపై నిర్వహించిన దాడుల్లో సుమారు 10 టన్నుల దుంగ లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పట్టుకున్న ఏ గ్రేడ్ చందనం విలువ సుమారు రూ. 11 కోట్ల విలువ ఉంటుందని ఈ సందర్భంగా పోలీసు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, ముంబైకి చెందిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశామనీ, హరియాణాకు చెందిన మరో నిందితుడు పరారీలోఉన్నాడని వివరించారు.

Read also: బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు అనుమతికై విజయ్ విజ్ఞప్తి

ఎర్రచందనం(Sandalwood)తిరుపతి నుంచి ఢిల్లీకి అక్రమంగా తరలించినట్టు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ఎపి, ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం భారీగా ఎర్రచందనం నిల్వలను స్వాధీనం చేసుకుంది. ఎపి నుంచి దిల్లీకి(Delhi)తరలించిన సుమారు 10 టన్నుల ఎర్రచందనాన్ని సంబంధిత సమాచారంతో పట్టుకున్నారు.ఢిల్లీలోని తుగ్లకాబాద్లో ఎర్రచందనం బయటపడింది. అంతేకాకుండా ఢిల్లీ, ఎపి పోలీసులు హైదరాబాద్, ముంబయికి చెందిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు ఇర్ఫాన్, అమిత్పవార్ ఉన్నారు. అయితే హరియాణాకు చెందిన మరో ఎర్రచందనం స్మగ్లర్ పరారీలో ఉన్నాడు. ఎర్రచందనం దుంగలను తిరుపతి నుంచి ఢిల్లీకి తరలించినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Crime News Latest News in Telugu Red Sandalwood smuggling Telugu News Today Tirupati News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.