Tirupati Crime: తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న కొబ్బరికాయలు విక్రయ కేంద్రం సమీపమున శనివారం సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని మహిళ సుమారు (25- 30) సంవత్సరములు కలిగి ఉండి అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో, ఆమె బాధను గుర్తించి అక్కడ ఉన్న గుర్తుతెలియని భక్తుల్లో ఎవరో 108 అంబులెన్స్ వారికి ఫోన్ ద్వారా సమాచారం తెలిపా రు.
Read Also: AP: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ
అంబులెన్స్ సిబ్బంది ఆ మహిళను తీసుకొని తిరుమల అశ్విని ఆసుపత్రి(Health Emergency) లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందినట్లు అశ్విని ఆసుపత్రి డ్యూటీ డాక్టర్లు నిర్ధారించారు. మృతి చెందిన మహిళ అడ్రస్సు, గుర్తింపు ఆధారాలు ఏమి లేనందున మృతదేహాని అశ్విని ఆసుపత్రి మార్చిరి నందు ఉంచారు. ఆ మహిళను ఎవరైనా గుర్తించిన, ఆ మహిళ యొక్క సమాచారం తెలిసిన తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ వారికి సమాచారాని ఈ క్రింద ఫోన్ నెంబర్లకు తెలుపగలరు.
సి ఐ..9440796769, ఎస్ ఐ..9440796771. 08772289027.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: