📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirupati Crime: ప్రియుడు మోజులో కన్నకూతుర్నే హతమార్చిన కసాయి తల్లి

Author Icon By Tejaswini Y
Updated: February 25, 2026 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirupati Crime: తిరుపతి పోస్టల్ కాలనీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. తన సుఖం కోసం కన్నబిడ్డనే కాలయముడిలా మారి హతమార్చింది ఓ తల్లి. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

Read Also: HPV Vaccine: దేశవ్యాప్తంగా బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్

Tirupati Crime: Butcher’s mother killed her daughter in a fit of rage by her boyfriend

సహజీవనం.. పెళ్లికి అడ్డుగా ఉందని..

పోస్టల్ కాలనీకి చెందిన ఆశాలత (19)కు గతంలోనే వివాహం కాగా, మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయింది. ఆమెకు దుర్గ (3) అనే కుమార్తె ఉంది. అయితే, ఆశాలత కొంతకాలంగా ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తన పెళ్లికి మూడేళ్ల కూతురు అడ్డుగా ఉందని భావించిన ఆశాలత, కన్నబిడ్డను అంతం చేయాలని నిశ్చయించుకుంది.

నది తీరంలో గుట్టుచప్పుడు కాకుండా..

అనుకున్నదే తడవుగా చిన్నారిని దారుణంగా హత్య చేసిన ఆశాలత, ఎవరికీ అనుమానం రాకుండా స్వర్ణముఖి నది సమీపంలో చిన్నారి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. బిడ్డ కనిపించకుండా పోవడంతో ఎవరూ అడగరని భావించినప్పటికీ, ఆమె ప్లాన్ బెడిసికొట్టింది. ఈ నెల 19వ తేదీ నుంచి తన కూతురు ఆశాలత, మనవరాలు దుర్గ కనిపించడం లేదంటూ ఆశాలత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు ఆశాలత ప్రవర్తనపై అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించగా, కన్నబిడ్డను చంపి పూడ్చిపెట్టిన నిజాన్ని ఆమె ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Crime Updates Ashalata Murder Case Child Murder News Mother kills daughter Tirupati crime news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.