Tirupati Bhuvana Suicide Case: భువన మృతి.. హత్య లేక ఆత్మహత్య?

Read Time:  1 min
Tirupati Bhuvana Suicide Case: భువన మృతి.. హత్య లేక ఆత్మహత్య?
FONT SIZE
GET APP

Tirupati Bhuvana Suicide Case: ప్రముఖ మోహన్ బాబు యూనివర్సిటీలో (MBU) బీటెక్ డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.తిరుమల పట్టణంలోని సాయితేజ ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో ఉంటున్న ఆమె, సోమవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం తోటి విద్యార్థినులు ఈ విషయాన్ని గమనించి హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Read also: Koti Firing Case: కోఠి కాల్పుల కేసును చేధించిన పోలీసులు

Tirupati Bhuvana Suicide Case: Bhuvana’s death.. murder or suicide?

ఈ ఘటనలో హాస్టల్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భువన మృతి చెందిన విషయాన్ని యాజమాన్యం తమకు చాలా ఆలస్యంగా తెలిపిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాము హాస్టల్‌కు చేరుకుని ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చదువులో చురుగ్గా ఉండే భువన ఆత్మహత్య చేసుకునేంత బలహీనరాలు కాదని, ఆమె మృతి వెనుక ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

స్టుడెంట్ వివరాలు..

తిరుపతి జిల్లా పుత్తూరు మండలం మంగళం పంచాయతీకి చెందిన రైతు సురేందర్ రెడ్డి, జానకి దంపతుల కుమార్తె అయిన భువన, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలన్న ఆశతో డేటా సైన్స్ కోర్సు చేస్తోంది. మరికొద్ది రోజుల్లో చదువు పూర్తి కావాల్సి ఉండగా, ఇలా విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. చదువుల ఒత్తిడి లేక మరేదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు హాస్టల్ సిబ్బందిని, స్నేహితులను విచారణా చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.