📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Thamma Movie: థామా మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్.. కారణం ఏంటంటే?

Author Icon By Aanusha
Updated: October 25, 2025 • 8:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల రష్మిక మంధన్న ‘థామా’, (Thamma Movie) శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ వంటి పలు ప్రముఖ చిత్రాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు సచిన్ సంఘ్వీ పై ఒక యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడంతో, పోలీసులు విచారణ అనంతరం సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Karnataka: బస్సు ప్రమాదంపై విచారణ జరపాలంటు డీకే శివకుమార్ 

సచిన్ సంఘ్వీ (Sachin) తనను లైంగికంగా వేధించాడంటూ ఒక యువతి సంచలన ఆరోపణలు చేసింది. సచిన్ సంఘ్వీ తనకు సంగీత పరిశ్రమలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడని, ప్రత్యేక మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేశాడని, తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లైంగికంగా వేధించాడని ఆ యువతి ఆరోపించింది.

బాధితురాలు దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, సచిన్ 2024లో ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా ఆ యువతిని సంప్రదించాడు.కొత్త మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని సచిన్ చెప్పాడు. అప్పటి నుంచి ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. సచిన్ ఒకసారి ఆ యువతిని తన స్టూడియోకి పిలిపించి అక్కడ లైంగికంగా వేధించాడని యువతి చెబుతోంది.

Thamma Movie

చాలాసార్లు లైంగికంగా వాడుకున్నాడని

సచిన్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి చాలాసార్లు లైంగికంగా వాడుకున్నాడని, ఆ తర్వాత మోసం చేశాడని ఆ యువతి చెప్పింది.సచిన్‌పై వచ్చిన ఆరోపణల గురించి ఆయన న్యాయవాది మాట్లాడుతూ, ‘ నా క్లయింట్‌పై ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ఈ కేసు విచారణకు అర్హమైనది కాదు.

పోలీసులు నా క్లయింట్‌ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధం, అందుకే ఆయనను వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు’ అని చెప్పుకొచ్చారు. సచిన్ -జిగర్ సంగీత ద్వయానికి బాలీవుడ్ (Bolywood) లో మంచి గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో వీరు ‘స్త్రీ 2’, ‘బేడియా’, ‘థామ’, జాన్వి ‘పరం సుందరి’ తదిరత సూపర్ హిట్ చిత్రాలకు కలిసి పనిచేశారు.

సూపర్ హిట్ పాటలను అందించారు. సచిన్ మొదట్లో ప్రీతమ్‌కు సహాయకుడిగా పనిచేశారు. తరువాత కొన్ని సినిమాలకు పాటలు కూడా పాడారు. తరువాత, జిగర్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

bollywood music director case latest news sachin sanghvi news sexual harassment complaint Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.