📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Karnataka: కర్ణాటక పులుల మృతిపై వీడిన మిస్టరీ

Author Icon By Shobha Rani
Updated: June 28, 2025 • 2:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక(Karnataka)లో ఇటీవల తీవ్ర కలకలం రేపిన ఐదు పులుల (Tiger) మృతి కేసు మిస్టరీ వీడింది. తన పెంపుడు ఆవును పులి చంపిందన్న ప్రతీకారంతోనే ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు అటవీశాఖ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడు, కేరళ (Tamilanadu-Kerala) సరిహద్దుల్లోని కర్ణాటక చామరాజనగర జిల్లా, మలెమహదేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో కొద్ది రోజుల క్రితం ఒక తల్లి పులి, నాలుగు కూనలు మరణించాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. స్థానికంగా నివసించే మాదురాజు అనే వ్యక్తి, తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ‘కించి’ అనే ఆవును ఇటీవల ఓ పులి వేటాడి చంపడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
ఆవును కోల్పోయిన బాధ.. పులిపై పగగా మారింది
దీంతో పులిపై పగ పెంచుకున్న మాదురాజు(Maadiraju), ఎలాగైనా దాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులైన కోనప్ప, నాగరాజుల సహాయంతో ఒక పథకం వేశాడు. పులి దాడిలో చనిపోయిన తన ఆవు కళేబరానికి విషం పట్టించి, దాన్ని అటవీ ప్రాంతానికి సమీపంలో వదిలేశాడు. ఆ విషపూరితమైన మాంసాన్ని తిన్న తల్లి పులి, దాని నాలుగు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి.
పగ తీర్చుకున్న ఘాతుకం
ఈ కేసును సవాలుగా తీసుకున్న అటవీశాఖ అధికారులు, తమ దర్యాప్తులో మాదురాజే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గుర్తించారు. అతడితో పాటు సహకరించిన స్నేహితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని మీణ్యం ప్రాంతంలోని ‘అరణ్య భవన్'(Aranya bhavan)కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

Karnataka: కర్ణాటక పులుల మృతిపై వీడిన మిస్టరీ

ఈ దారుణ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. జరిగిన విషయంపై పూర్తి నివేదిక సమర్పించాలని, నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రేను ఆయన ఆదేశించారు.
అటవీశాఖ అప్రమత్తం.. నిందితుల అరెస్ట్
అటవీశాఖ సీనియర్ అధికారుల నేతృత్వంలో సాంకేతిక ఆధారాలు, జీపీఎస్ (GPS) ట్రాకింగ్, దృశ్య ఆధారాలు ద్వారా
మాదురాజు పథకం బయటపడింది. అతడితోపాటు సహకరించిన కోనప్ప, నాగరాజులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రస్తుతం మీణ్యం ‘అరణ్య భవన్’కు తరలించి విచారణ కొనసాగుతోంది.
నేరానికి శిక్ష తప్పదు: సీఎం సిద్ధరామయ్య
ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramayya)స్పందిస్తూ: “ఇది కేవలం పులుల మృతి కాదు, వన్యజీవ వైవిధ్యంపై దాడి” అని అన్నారు.
పర్యావరణ ప్రేమికుల ఆవేదన
పులుల మరణాన్ని ఒక కుట్రగా పేర్కొంటూ పర్యావరణ సంరక్షణ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇది కేవలం ఒక వ్యక్తిగత ప్రతీకారమే కాకుండా వన్యప్రాణి సంరక్షణ చట్టానికి గట్టి సవాలు అని వారు పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల పులుల సంఖ్యపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Read Also: Kolkata: కోల్‌కతా గ్యాంగ్ రేప్.. వైద్య నివేదికలో విస్తుపోయే నిజాలు!

ForestCrime Google news JusticeForTigers KarnatakaTigerDeaths SaveTheTigers Telugu News The mystery surrounding the deaths Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.