📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

News Telugu: TG: మావోయిస్టులను నిర్మూలించడం అసాధ్యం: చంద్రన్న వ్యాఖ్యలు

Author Icon By Rajitha
Updated: October 31, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయ, భద్రతా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 45 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన ఇటీవల తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించడం అసాధ్యమని, ప్రభుత్వ ఆపరేషన్లు తాత్కాలిక ప్రభావం చూపగలిగినా, ఉద్యమాన్ని పూర్తిగా ఆపలేవని చంద్రన్న అభిప్రాయపడ్డారు. అలాగే పార్టీ లోపలే నమ్మకద్రోహులు ఉన్నారని, బసవరాజు ఎన్‌కౌంటర్ వెనుక కోవర్ట్ ఆపరేషన్ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Read also: Mass Jathara review : మాస్ జాతర రివ్యూ మాస్ ఎంటర్‌టైనర్ థియేటర్స్‌లో హిట్ టాక్

TG: మావోయిస్టులను నిర్మూలించడం అసాధ్యం

తాను అనారోగ్య కారణాల వల్లే అజ్ఞాతం వీడానని చంద్రన్న తెలిపారు. ఆయుధాలు వదిలి లొంగిపోవడాన్ని సమర్థించనని, కానీ ఆరోగ్య సమస్యలు, భద్రతా దళాల ఒత్తిడి, సిద్ధాంతపరమైన విభేదాలు కారణంగా ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. 1979లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU)తో ప్రారంభమైన ఆయన ప్రయాణం పీపుల్స్ వార్ గ్రూప్‌ ద్వారా కేంద్ర కమిటీలో స్థానం సంపాదించటానికి దారితీసింది. సుదీర్ఘకాలం మావోయిస్టు కార్యకలాపాలకు మార్గదర్శకుడిగా ఉన్న చంద్రన్న వ్యాఖ్యలు ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమ భవిష్యత్తుపై కొత్త చర్చకు దారితీశాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Basavaraju Encounter Chandranna Surrender latest news Maoists Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.