📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు

TG: సిగాచి బాధితులకు పరిహారం.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

Author Icon By Pooja
Updated: January 30, 2026 • 2:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంగారెడ్డి(TG) జిల్లా సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు పరిహారం చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పరిహారం పంపిణీలో స్పష్టత లేకపోవడం, ఆలస్యం కొనసాగుతుండటంపై ధర్మాసనం ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.

Read Also:TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

High Court expresses anger over the government’s approach.

పేలుడు ఘటన నేపథ్యం

గత ఏడాది సంగారెడ్డి జిల్లా(TG) పాశమైలారం ప్రాంతంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోగా, 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ప్రమాదంలో మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు తగిన పరిహారం చెల్లించాలని, ఘటనపై సిట్ దర్యాప్తు చేపట్టాలని కోరుతూ బాబురావు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం,
“పరిహారం ఎంత ప్రకటించారు? ఇప్పటివరకు ఎంత చెల్లించారు? అసలు ఎప్పుడు ఇస్తారు?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది.

పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశం

పరిహారం పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కంపెనీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదనంగా, ఈ కేసులో ఈపీఎఫ్ హైదరాబాద్ రీజినల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలిలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. కంపెనీ ప్రకటించిన పరిహారం మరియు చట్టప్రకారం బాధితులకు అందాల్సిన ప్రయోజనాల వివరాలను సమర్పించాలని వారికి నోటీసులు జారీ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu SangareddyBlast SigachiPharma

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.