📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: TG Crime: ఇదెక్కడి వింత.. చీమల భయంతో వివాహిత ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: November 6, 2025 • 2:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మనుషుల జీవితంలో భయం ఒక సహజ భావన. కానీ ఆ భయం మితిమీరితే అది ప్రమాదకరంగా మారుతుంది. కొందరికి ఎత్తైన భవనాలు చూస్తే భయం (Phobia) , ఇంకొందరికి లోతైన నీటి బావులు, మరికొందరికి చీకటి లేదా జంతువుల పట్ల భయం ఉంటుంది. ఇవన్నీ ఫోబియాలుగా పిలవబడే మానసిక వ్యాధుల రూపాలు. అలాంటి ఒక ఫోబియా తాజాగా ప్రాణాలను బలిగొంది. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను కలిచివేసింది.

Read Also: Kerala Crime: ఘోరం.. బాలికపై లైంగిక దాడి

మున్సిపాలిటీ పరిధిలోని శర్వా హోమ్స్‌కు చెందిన మనీషా (25) అనే వివాహిత.. చీమల ఫోబియా కారణంగా ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది.కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనీషా కొంతకాలంగా చీమల ఫోబియా (Myrmecophobia) తో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చూపించినా ఫలితం లేకపోయింది. ఈనెల 4వ తేదీన సాయంత్రం భర్త శ్రీకాంత్ ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి.. బెడ్‌రూమ్ తలుపు లోపల గడియ పెట్టి ఉంది.

TG Crime

నోట్‌బుక్‌లో మృతురాలు రాసిన సూసైడ్ నోట్

స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా.. మనీషా (Manisha) చీరతో ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు గదిని పరిశీలించగా.. అక్కడ ఒక నోట్‌బుక్‌లో మృతురాలు రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో, ‘శ్రీ.. ఐయాం సారీ.. ఈ చీమలతో బ్రతకడం నావల్ల కావట్లేదు.. కూతురు అన్వి జాగ్రత్త.. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మొక్కులు తీర్చండి’ అని రాసి ఉంది.

ఈ సూసైడ్ నోట్ ఆమె ఫోబియా తీవ్రతను, మానసిక క్షోభను తెలియజేస్తుంది. సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Aminpur insect fear latest news myrmecophobia sangareddy Telangana news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.