हिन्दी | Epaper
పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Telugu News: TG Crime: ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

Pooja
Telugu News: TG Crime: ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6  మంది మృతి

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనడానికి వెళ్తూ రాష్ట్రంలో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాలు ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట శివారులోని 161వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Read Also: Second Phase Polling: ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

 TG Crime
TG Crime

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన(TG Crime) కురుమ లింగమయ్య (45), ఆయన భార్య సామప్ప (40), కుమారుడు సాయిలు (18), కూతురు మానస (8) హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవపూర్(TG Crime) సమీపంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు స్వగ్రామానికి వెళ్తున్న బుర్ర నవీన్ (27), బుర్ర కల్యాణ్ (27) బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించే సమయంలో ఇద్దరూ మృతి చెందారు.

ఎన్నికల ఒత్తిడితో సర్పంచి అభ్యర్థి మృతి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్‌లో సర్పంచి అభ్యర్థి దామాల నాగరాజు ఎన్నికల ప్రచార ఒత్తిడితో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.

పోలింగ్ రోజే అభ్యర్థికి గుండెపోటు

మంచిర్యాల జిల్లాలో పోలింగ్ కొనసాగుతున్న సమయంలో తాండూరు మేజర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ రెబల్ సర్పంచ్ అభ్యర్థి వెంకటస్వామికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870