యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు (ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఈరోజు మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ రంగం (Software sector) లో మంచి భవిష్యత్తు కల యువకుడు అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది.
Read Also: TG Crime: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
గ్రామానికి చెందిన భూషి గణేశ్ (26) బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంటి వద్దే తన విధులు నిర్వర్తించేవాడు. తల్లిదండ్రులు ఎంతో గర్వపడే కుమారుడైన గణేశ్, కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాడు.
ఈ క్రమంలో, ఇటీవల తమ ఇంటికి చేసిన ప్లాస్టరింగ్ పనుల (Plastering works) కోసం ఉపయోగించిన ఇనుప పైపులను తొలగించే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ పైపు ప్రమాదవశాత్తు సమీపంలోని విద్యుత్ తీగలకు తాకింది. దీంతో గణేశ్‌కు తీవ్రంగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు
గమనించిన తండ్రి నర్సింహ వెంటనే అతడిని కాపాడి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, మార్గమధ్యంలోనే గణేశ్ ప్రాణాలు విడిచాడు. కుమారుడిని కాపాడే క్రమంలో తండ్రి నర్సింహకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
కళ్ల ముందే కొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో లింగరాజుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఆ కుటుంబానికి ఒక్కగానొక్క కుమారుడు కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: