📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest news: TG Crime: కూతురి కిడ్నాప్ కు యత్నించిన తల్లిందండ్రులు.. కేసు నమోదు

Author Icon By Anusha
Updated: November 5, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జగిత్యాల జిల్లా (Jagtial District) లో చోటుచేసుకున్న ఓ కుటుంబ కలహం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎండపల్లి మండలం (Endapalli Mandal) రాజరాంపల్లి గ్రామంలో సొంత తల్లిదండ్రులే తమ కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే..పెద్దపల్లి జిల్లా (Peddapally district) పాలకుర్తి మండలం బసంత్ నగర్ కు చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన మర్రి రాకేష్‌ గత ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు.

Read Also: Sultana Joti: బంగ్లాదేశ్ మహిళా జట్టు కెప్టెన్‌పై మాజీ ప్లేయర్ ఆరోపణలు

అబ్బాయి తక్కువ కులానికి చెందిన వ్యక్తి కావడంతో ప్రియాంక (Priyanka) తల్లిదండ్రులు ఈ పెళ్ళికి నిరాకరించారు. దీంతో జులై 27న కులాంతర వివాహం చేసుకుంది. దీంతో ఆగ్రహించిన ప్రియాంక తల్లిదండ్రులు.. ప్రియాంక రాకేష్ లను విడదీసేందుకు విఫల ప్రయత్నాలు కొనసాగించారు. కానీ, ప్రియాంక రాకేష్ వైపు బలంగా నిలబడడంతో ఏమీ చేయలేకపోయారు.

నాలుగు నెలల తర్వాత ప్రియాంక కడుపుతో ఉందని కూడా చూడకుండా జన సందోహం మధ్యలోనే ప్రియాంక తండ్రి వెంకటేష్, బావ గుంజే కుమార్ లు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. తమ అమ్మే తనను నమ్మిచ్చి మోసం చేసిందనీ బాధితురాలు ప్రియాంక కన్నీటి పర్యంతం అయ్యింది.

TG Crime

ముందస్తు పథకం ప్రకారం

మంచిగా బతుకుర్రి బిడ్డా అంటూ ఇంటికీ వచ్చి దగ్గరైందనీ, కడుపుతో ఉన్నా అని.. చెప్పినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తానని నమ్మిచ్చిందని వాపోయింది. జగిత్యాల హాస్పిటల్ లో చూపించిన అనంతరం రాజారాంపల్లి రాగానే ముందస్తు పథకం ప్రకారం భహిర్భూమి నెపంతో తమ అత్తమ్మను బయటికి తీసుకెళ్లిందని..

ఆమె, వెళ్ళగానే తన తండ్రి వెంకటేష్, తన అక్క భర్త గుంజ కుమార్ లు కార్ లో వచ్చి కిడ్నాప్ కు ప్రయత్నించారని చెప్పింది.. స్థానికుల సహాయంతో తప్పించుకుని పోలీసుల సాయంతో క్షేమంగా ఇంటికి చేరానంటూ ప్రియాంక కన్నీటి పర్యంతం అయ్యింది.

తనని కిడ్నాప్ చేయుటకు ప్రయత్నించి, చంపుతా అంటూ బెదిరించిన తల్లిదండ్రులపై బాధితురాలు ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు, తన భర్త రాకేష్ కు తల్లిదండ్రులతో పాటు అక్క భర్త తో ప్రాణ భయం ఉందనీ, రక్షణ కల్పించాలని ప్రియాంక ఫిర్యాదులో పేర్కొన్నది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

endapalli mandal intercaste marriage jagtial news latest news rajarampalli kidnap case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.