(TG Crime) రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని, ఆర్టీసీ కాలనీ వద్ద ఐశ్వర్య, తన తండ్రి పాండుతో కలిసి రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు వారిద్దరినీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐశ్వర్య, పాండులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఐశ్వర్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం పాండును వేరే ఆసుపత్రికి తీసుకెళ్లారు. (TG Crime) యంసాయని ఐశ్వర్య, మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నది.
Read Also: TG Crime: అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: