📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: TG Crime: ఇన్‌స్టాగ్రామ్ లో ప్రేమ.. గర్భం దాల్చిన బాలిక

Author Icon By Sushmitha
Updated: October 29, 2025 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గ్యాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాక చాలామంది యువత పెడత్రోవ పడుతున్నారు. ప్రత్యేకంగా సెల్ ఫోన్లు చేతిలోకి రావడంతో వారి అందమైన బాల్యం చేదుజ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. ముక్కుమొహం తెలియని వారితో పరిచయం, ప్రేమ అంటూ మోసపోతున్నారు. కెరీర్ ను తీర్చిదిద్దుకోవాల్సిన సమయంలో ప్రేమ అంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్(Instagram) లో ఓ మైనర్ బాలిక, బాలుడికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి..

Read Also: AP: ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ల కల్పనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

బాలుడిపై పోక్సో కేసు

గుంటూరు జిల్లా పట్టాభిపురం పీఎస్ పరిధిలోని కోబాల్ట్ పేటకు చెందిన బాలిక (17), ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అదే ప్రాంతానికి చెందిన బాలుడు(17) మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చాటింగ్ చేస్తూ, చివరికి ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో వీరిద్దరు పలుమార్లు శారీరకంగా కలుసుకున్నారు. దీంతో మైనర్ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో నెత్తినోరు కొట్టుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడిపై పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు.

పిల్లలు సెల్ ఫోన్ లలో(cell phone) ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారో కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. అంతేకాక వారు స్కూలు, కళాశాలకు వెళ్తున్నప్పుడు వారిపై ఒక నిఘాకన్ను ఉంచాలి. వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారో కూడా గమనిస్తూ ఉండాలి. లేకపోతే ఊహించని అనర్థాలు జరుగుతాయి. అప్పుడు ఎంత బాధపడ్డా లాభం ఉండదు. పోలీసులు కూడా పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని పదేపదే హెచ్చరిస్తున్నా ఇలాంటి ఘోరాలు  జరుగుతూనే ఉన్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Cyber grooming Google News in Telugu Instagram crime Latest News in Telugu Minor pregnancy POCSO case Social media risk Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.