📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: TG Crime: ప్రాణంమీదకు తెచ్చిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. పెళ్లి

Author Icon By Anusha
Updated: October 27, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రేమంటే రెండు మనసుల కలయిక మాత్రమే కాదు రెండు కుటుంబాల కలయిక. ప్రేమ ఎప్పుడూ పరిపక్వతే. అపరిపక్వతో తీసుకునే ఏ నిర్ణయాలైనా అది ప్రేమకిందకు రాదు. లేత వయసులో ప్రేమ కంటే ఆకర్షణే అధికంగా ఉంటుంది. కానీ ఆ ఆకర్షణే ప్రేమగా భ్రమించి, అనూహ్య నిర్ణయాలను తీసుకుని, అర్థాంతరంగా జీవితాన్ని ముగిస్తుంటారు.

Read Also: Kurnool Accident: మళ్లీ ప్రమాదం – వరుసగా మూడు కార్లను ఢీకొట్టిన కంటైనర్

ఇటీవల కాలంలో సోషల్ మీడియా (Social media) ప్రేమలు అధికం అవుతున్నాయి. పరిచయం ప్రేమగా మారడం తర్వాత పెళ్లి కోసం ఒకరిపై ఒకరు ఒత్తిడి చేయడంతో అటు హత్యగా, ఇటు ఆత్మహత్యలకు గురవుతున్న జంటలను మనం నిత్యం వార్తల్లో చూస్తున్నాం. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇన్స్టాగ్రామ్ ప్రేమతో ఒక్కటైయ్యేందుకు నిర్ణయం

సింగరేణి (Singareni) లో రిబోరింగ్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న గోదావరిఖని విఠల్ నగర్ కుచెందిన దానవేన రవితేజ పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామంలో పదోతరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్న మౌనిక(17)ల మధ్య రెండేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ (Instagram) ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటైపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో నెలరోజుల క్రితం మౌనిక, రవితేజ ఇంటికి వచ్చింది.

TG Crime

18 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేయాలని

అయితే మౌనిక మైనర్ కావడంతో 18 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేయాలని ఇరువురు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే నెల ఒకటో తేదీన ముహూర్తం నిర్ణయించగా, కుల సంప్రదాయం ప్రకారం రవితేజ, మౌనిక, వీరి కుటుంబ సభ్యులు గోదావరి నదికి స్నానాలకు వెళ్లారు. స్నానం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుని పోసాగారు. అక్కడే ఉన్న జాలర్లు వీరిద్దరిని బయటకు తెచ్చారు.

రవితేజకు ప్రాణాపాయం తప్పినప్పటికీ, మౌనిక అప్పటికే మృతి చెందింది. దీంతో పెళ్లిపీటలు ఎక్కనున్న మౌనిక పాడెను ఎక్కింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నిండుకుంది.మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారా లేదా నిజంగానే ప్రమాదవశాత్తుగా నీటిలో కొట్టుకునిపోయారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

instagram love latest news Telangana news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.