📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

TG Crime: చేవెళ్ల బస్సు ప్రమాదం.. ప్రధాన నిందితుడిగా టిప్పర్ ఓనర్

Author Icon By Anusha
Updated: December 24, 2025 • 5:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(TG Crime) చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద గత నెల 3న ఆర్టీసీ బస్సు-టిప్పర్ ఢీకొన్న ఘటనలో టిప్పర్ డ్రైవర్ సహా 18 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయగా, తాజాగా (TG Crime) ఈ కేసులో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషాదానికి కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రమే కారణం కాదని.. వాహన యజమాని మితిమీరిన లాభాపేక్షే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. దీంతో టిప్పర్ యజమాని లచ్చు నాయక్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా (A1) చేరుస్తూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను సవరించారు.

Read Also: Canada Crime: కెనడాలో ఇండియన్ ఉమెన్ హత్య.. ప్రియుడిపై అనుమానం

నిబంధనలకు విరుద్ధం

దర్యాప్తు వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో టిప్పర్ పరిమితికి మించిన లోడ్‌తో ఉంది. వాహనం బరువు ఎక్కువగా ఉండటం వల్ల వేగాన్ని నియంత్రించడం డ్రైవర్‌కు కష్టమైంది. దీనికి తోడు వాహనం రాంగ్ రూట్‌లో అతి వేగంగా ప్రయాణించడం ప్రమాద తీవ్రతను పెంచింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ పక్కనే ఉన్న యజమాని లచ్చు నాయక్.. డ్రైవర్ ఆకాష్ కాంబ్లేను హెచ్చరించకపోగా, అధిక లోడుతో వాహనాన్ని నడపమని ప్రోత్సహించినట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో వాహనాన్ని రోడ్డుపైకి అనుమతించడం క్రిమినల్ నిర్లక్ష్యం కిందకు వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

TG Crime: Chevella bus accident.. Tipper owner as the main accused

సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో డ్రైవర్లను మాత్రమే బాధ్యులను చేస్తారు. కానీ.. చేవెళ్ల పోలీసులు ఈ కేసులో వాహన యజమాని పాత్రను లోతుగా విశ్లేషించారు. అధిక లోడు వల్ల బ్రేకులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని, వాహనం నియంత్రణ తప్పుతుందని తెలిసి కూడా అనుమతించినందుకు లచ్చు నాయక్‌పై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం లచ్చు నాయక్ కూడా అదే ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో అతను కోలుకున్న వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Chevella accident latest news overloading accident Telugu News tipper owner arrested

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.