📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Telangana :కామారెడ్డి జిల్లా లో పదో తరగతి పేపర్ లీక్..

Author Icon By Anusha
Updated: March 27, 2025 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నా, కొన్ని ప్రాంతాల్లో ప్రశ్నాపత్ర లీకేజీ ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షల నిర్వహణలో గోచరించే సడలింపు కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా, కామారెడ్డి జిల్లాలో పేపర్ లీక్ కేసు సంచలనం సృష్టించింది. జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పరీక్ష ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలు లీకైనట్లు గుర్తించారు. స్కూల్ సిబ్బందే ఈ లీక్‌కు కారణమని అధికారులు నిర్ధారించారు.

లీకేజీ వ్యవహారం

ఇటీవల అస్సాం కూడా లో ఇంటర్మీడియట్‌ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించింది. మార్చి 21న జరగాల్సిన 11వ తరగతి మ్యాథమెటిక్స్‌ పరీక్ష పేపర్ లీక్ కావడంతో అస్సాం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ సంఘటన వెలుగులోకి రాగానే మార్చి 24 నుంచి 29 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి రనోజ్‌ పెగు ప్రకటించారు.

పేపర్ లీక్

మార్చి 25వ తేదీ పరీక్ష కోసం విద్యార్థులు హాల్‌లో కూర్చొని ఉండగా, పరీక్ష ప్రారంభానికి ముందు కొందరు సిబ్బంది ప్రశ్నల కొన్ని భాగాలను కాగితంపై రాసి బయటకు పంపారు. ఈ ప్రశ్నలు అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పరీక్ష మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అధికారుల దర్యాప్తు

పరీక్ష ప్రశ్నాపత్రం లీకైన విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన అధికారులు, జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాల సిబ్బంది ముగ్గుర్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు.సస్పెండ్ అయినవారు:చీఫ్ సూపరింటెండెంట్ – సునీల్,డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ – భీమ్,ఇన్విజిలేటర్ – దీపిక.

లీకేజీ ఘటనలు

ఈ పరీక్షా సమయాల్లో లీకేజీ ఘటనలు కొత్తకావు. గతంలో కూడా పలు లీకేజీ ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటన విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడేఅవకాశం ఉంది కాబట్టి వీటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. పరీక్షల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు మరింత కఠినంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది.ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల పరీక్షల భద్రతపై అనేక అనుమానా లు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థులు సమాజంలో పోటీ పరీక్షలు రాసేలా ఉండాలంటే, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మరింత క్రమశిక్షణ అవసరమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

#EducationCrisis #ExamScandal #QuestionPaperLeak #SSCExams #telangana #TelanganaNews Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.