📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Drugs-మందుల తయారీ చాటున మత్తు పదార్థాలు..

Author Icon By Pooja
Updated: September 8, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Drugs-రెండురోజుల క్రితం మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్లో భారీ మత్తుపదార్థాల కంపెనీలపై ఆకస్మిక దాడులు చేసింది. ఈ దాడుల్లో పోలీసులే విస్తూ పోయే విషయాలు వెల్లడయ్యాయి. పైకిమాత్రం అదొక ఆరోగ్యాన్నిచ్చే మందుల ల్యాబొరెటరీస్(Laboratories) గా పేరు లోపల మాత్రం విలువైన డ్రగ్స్ తయారు చేయడం పోలీసులనే విస్తూపోయేలా చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని మిరా భయాందార్, వసాయ్ విరార్ పోలీసులు శనివారం చర్లపల్లి పారిశ్రామికవాడలోని వాగ్దేవి ల్యాబొరెటరీస్ పై దాడులు చేసి రూ.11.58 కోట్ల విలువైన మత్తుమందులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వోలేటి శ్రీనివాస్ విజయ్ అనే వ్యక్తి నాలుగేళ్లుగా ఇక్కడ డ్రగ్స్ తయారు చేస్తూ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

పక్కరాష్ట్ర పోలీసులు వచ్చేంతవరకు మనకు తెలియదు

బొల్లారం, నాచారం, చర్లపల్లి ఇవన్నీ హైదరాబాద్ నగరంలో ప్రధాన ప్రాంతాలుగా మారాయి. ఇక్కడ పోలీసుల పర్యవేక్షణ, నిఘా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అయినా పక్క రాష్ట్రాల పోలీసులు వచ్చి దాడులు చేసేంత వరకు ఇక్కడ ఫార్మా పరిశ్రమల్లో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు తయారవుతున్నట్లు తెలుసుకోలేకపోయారు. మత్తుమందుల కట్టడిలో ఎంతో ముందున్నామని, ‘ఈగల్’ పేరుతో ప్రేత్యక విభాగం ఏర్పాటు చేశామని చెప్పుకొనే రాష్ట్ర పోలీసుశాఖకు ఇలాంటి ఘటనలు తలవంతులు తెచ్చిపెట్టినట్లు అయ్యింది. నగరంలో ఫార్మా పరిశ్రమల్లో వందల కిలోల డ్రగ్స్ తయారవుతున్నా మన పోలీసులు గుర్తించలేకపోతున్నారు.

అన్ని హంగులతో నడుస్తున్న కంపెనీ

పైకి మాత్రం అదొక ఉపాధి సంస్థలా అన్ని హంగులతో కనిపిస్తుంటుంది. పదుల సంఖ్యలో ఉద్యోగులతో నడుస్తున్న కర్మాగారాల్లో డ్రగ్స్ ఉత్పత్తి(Drug production in factories) చేస్తున్నారు. నాచారంలోని ఇంచెమ్ ల్యాబొరెటరీ పదుల సంఖ్యలో ఉద్యోగులతో కొన్నేళ్లుగా మత్తుమందులు ఉత్పత్తి చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు చెప్పేంతవరకు తెలియదు. ఎందుకంటే మెఫిడ్రోన్, కేటమైన్, యాంఫిటమైన్ లాంటివి ఔషధాల తయారీలోనూ వినియోగించే ముడిసరుకులు కావడంతో వాటి రవాణాలోనూ పెద్దగా ఆంక్షలు విధించలేకపోతున్నారు. ఔషధ ఉత్పత్తిలో హైదరాబాద్ దేశంలోనే ముందు వరుసలో ఉంది. ఈ ఉదంతం బయటపడడంతో ఇక పోలీసులు పరిశ్రమలను జల్లెడ పట్టి డ్రగ్స్ ఉత్పత్తినీ కట్టడి చేయాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. మత్తువల్ల యువత జీవితం అంధకారంలో మగ్గిపోతున్నది. ప్రత్యేకంగా యూనివర్సీటీలు, మెడికల్, ఇంజినీరింగ్ వంటి కళాశాలల్లో అక్రమంగా మత్తు సరఫరా అవుతున్న కారణంగా విద్యార్థులు సైతం దీని భారీన పడుతున్నారు.

మందుల తయారీ చాటున మత్తు పదార్థాలు ఎలా తయారు చేస్తున్నారు?
కొంతమంది అక్రమంగా ఔషధాల ఉత్పత్తి పేరుతో ల్యాబ్‌లలో మత్తు పదార్థాలను తయారు చేస్తున్నారు. వీటిని డ్రగ్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

ఈ రకమైన అక్రమ కార్యకలాపాలు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి?
ప్రధాన నగరాల పరిసరాల్లో, పరిశ్రమల ప్రాంతాల్లో రహస్యంగా ఈ ల్యాబ్‌లు నడుస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-social-media-ban-on-social-media-in-nepal/national/543433/

Breaking News in Telugu Drug Mafia Drug Manufacturing Scam Fake Medicine Labs Google News in Telugu Illegal Drugs in India Narcotics Production Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.