📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Dharmasthala- ధర్మస్థల కేసులో ఊహించని మలుపు.. ముసుగు వ్యక్తి అరెస్టు

Author Icon By Pooja
Updated: August 23, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Dharmasthala : దేశంలో తీవ్ర సంచలనంగా మారిన ధర్మస్థల కేసు ఊహించని మలుపు తిరిగింది. తాను వందల మంది మహిళలు, అమ్మాయిల మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పి, కర్ణాటక రాష్ట్రంతో(Karanataka state) పాటు దేశంలోనే రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఈ కేసు చివరికి ఇదంతా ప్రజలను తప్పుదారి పట్టించేందుకే చేశాడని తెలుసుకున్న అధికారులు, పోలీసులు విస్మయమొందారు. చివరికి ముసుగ వ్యక్తి భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ధర్మస్థలకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే అభియోగంతో అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఇటీవల ధర్మస్థల వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో వందలాది మంది మృతదేహాలను తాను పూడ్చిపెట్టానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా ఆరోపణలు చేశారు. అందులో ఎక్కువగా అత్యాచారం, హత్యలకు గురైన మహిళలవే ఉన్నట్లు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన సిట్ అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. కానీ మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు.

Telugu News: Crime News- ధర్మస్థల కేసులో ఊహించని మలుపు.. ముసుగు వ్యక్తి అరెస్టు

భీమాను అరెస్టు చేసిన పోలీసులు

శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మహంతి భీమాను(Pranab Mahanti Bhima) విచారించారు. అతడు మాయమాటలు చెప్పి వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదనిఅంటున్నాడని సిట్ విచారణలో గుర్తించారు. ఈ క్రమంలోనే అధికారులు భీమాను అరెస్టు చేశారు. శనివారం అతడిని కోర్టులో హాజరుపర్చనున్నారు. అంతకు ముందు కూడా భీమా ఈ కేసు విషయంలో మాట మార్చాడు. తనకు ఒకరు పుర్రె ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని చెప్పారని.. కోర్టులో ఆర్జీ కూడా వారే చేయించారని పేర్కొన్నాడు. 2014 నుంచి తాను తమిళనాడులోనే ఉంటున్నానని చెప్పాడు. దీంతో ధర్మస్థల వ్యవహారం మలుపు తిరిగింది.

తన కూతురు మిస్ కూడా ఫేక్ న్యూసే

ధర్మస్థలకు వెళ్లిన తన కూతురు మిస్ అయిందని గతంలో తాను చెప్పినవన్నీ కట్టుకథలే అని చెప్పింది. ఇంతకుముందు ఆమె పోలీసులకు తన కూతురు అనన్య భట్ కనిపించకుండా
పోయినట్లు ఫిర్యాదు చేశారు. 2003లో తన కూతురు స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లి రాలేదని చెప్పారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు పట్టించుకోలేదని తనను బెదిరించి
పంపించినట్లు వాపోయారు. దీంతో పోలీసులు దీనిపై కూడా దర్యాప్తు చేపట్టారు. ఆమె నిన్న మరో ట్విస్ట్ ఇచ్చారు. న కూతురు మిస్ అయినట్లు చెప్పిందంతా కట్టుకథేనని ఓ యూట్యూబ్
ఛానల్తో మాట్లాడుతూ చెప్పింది. తనకు అసలు అనన్య భట్ పేరుతో కూతురే లేదని, ధర్మస్థల కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు నాతో అలా చెప్పించినట్లు పేర్కొంది.
అనన్య మిస్ అయినట్లు వచ్చిన ఫొటోలు కూడా సృష్టించినవేనని చెప్పింది. దేశం మొత్తం మీడియా ఈ కేసుపై ఎన్నో వీడియోలు యూట్యూబ్లో హల్ చెల్ చేస్తున్నాయి. ఈ కేసును
సీరియస్గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేయాలని సిట్ను ఏర్పాటు చేసింది. గత కొన్ని రోజులుగా చేస్తున్న తవ్వకాలలో ఎలాంటి మృతదేహాలకు సంబంధించిన ఎముకలు లభ్యం కాలేదు. దీంతో ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు చేసిన ముసుగు వ్యక్తి భీమాను అరెస్టు చేశారు.

భీమాను ఎందుకు అరెస్టు చేశారు?
ప్రజలను తప్పుదారి పట్టించడానికి, ధర్మస్థల పేరును చెడగొట్టే ప్రయత్నం చేశాడనే ఆరోపణలతో SIT అధికారులు భీమాను అరెస్టు చేశారు.

కూతురు మిస్సింగ్ కేసు అసలేమైంది?
భీమా తన కూతురు అనన్య భట్ మిస్సయ్యిందని చెప్పినా, తరువాత ఆ విషయమంతా కట్టుకథేనని తేలింది. అసలు అలాంటి కూతురే లేనని భీమా భార్య యూట్యూబ్‌లో వెల్లడించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-crime-news-suspicious-death-of-newlyweds-in-vijayanagaram-district/andhra-pradesh/534783/

Bhima Arrest News Dharmasthala case Fake Missing Daughter Claim Google News in Telugu Karnataka crime news Karnataka SIT investigation Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.