📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Cyber Crime-సైబర్ నేరగాళ్లకు టెలికాం శాఖ చెక్..

Author Icon By Pooja
Updated: September 9, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Cyber Crime-హైదరాబాద్ : దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపే క్రమంలో కేంద్రం మరో కీలక ముందడుగు వేసింది. నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు పొంది, వాటి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లకు టెలికాం శాఖ(Telecom Department) చెక్ పెట్టింది. దేశవ్యాప్తంగా ఈ తరహాలో ఉన్న రెండు కోట్ల సిమ్ కార్డులను టెలికాం శాఖ తాజాగా బ్లాక్ చేసింది. సంచార్ సాథి పోర్టల్ ద్వారా సైబర్ నేరాలకు వాడుతున్న సిమ్ కార్డులను గుర్తించి, వాటిని బ్లాక్ చేసినట్టు శాఖ వెల్లడించింది.

రెండుకోట్ల నకిలీ సిమ్ కార్డుల బ్లాక్

సైబర్ నేరాల నివారణకు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌తో పాటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ(Cyber Security) బ్యూరో సహా పలు కేంద్ర, రాష్ట్ర పోలీసు విభాగాలు దేశ, విదేశాల్లో ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. పదుల సంఖ్యలో సైబర్ నేరగాళ్లు అరెస్టవుతుండడం, కోట్లాది రూపాయల డబ్బులు నేరగాళ్ల నుంచి జప్తు కావడం ఇదివరకే జరిగింది. అయినప్పటికీ నకిలీ పత్రాలతో భారత్లో సిమ్ కార్డులు కొనుగోలు చేసిన నేరగాళ్లు వాటిని విదేశాలకు, ముఖ్యంగా కాంబోడియా, మయన్మార్, వియత్నాం వంటి దేశాల్లోని సైబర్ నేరాలకు కేరాఫ్‌గా ఉన్న అడ్డాలకు పంపుతున్నారు. అక్కడి నుంచి పెద్ద స్థాయి నేరగాళ్లు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని, ఇక్కడ ఏజెంట్లను నియమించుకుని కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు.

నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి సేకరించిన జాబితాను పరిశీలించిన టెలికాం శాఖ, రెండు కోట్ల సిమ్ కార్డులను బ్లాక్ చేసింది. ఈ కార్డులన్నీ సైబర్ నేరాలకు వాడుతున్నట్లు శాఖ నిర్ధారించింది. టెలికాం కార్యదర్శి నీరజ్ మిట్టల్ మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంచార్ సాథి పోర్టల్ వల్లే సైబర్ నేరాలకు పాల్పడే సిమ్ కార్డులను గుర్తించి వాటిని బ్లాక్ చేయగలుగుతున్నాం” అని తెలిపారు.

టెలికాం శాఖ ఎంతమంది నకిలీ సిమ్ కార్డులను బ్లాక్ చేసింది?
దేశవ్యాప్తంగా రెండు కోట్ల నకిలీ సిమ్ కార్డులను బ్లాక్ చేసింది.

ఈ సిమ్ కార్డులు ఏ విధంగా వాడబడ్డాయి?
నకిలీ పత్రాలతో తీసుకున్న సిమ్ కార్డులను సైబర్ నేరాలకు వాడారు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-elections-polling-stations-set-up-for-jubilee-hills-by-elections/news/politics/543695/

Cyber Crime India Cyber Security India Fake SIM Cards Blocked Google News in Telugu Latest News in Telugu Sanchar Saathi Portal Telecom Department Action Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.