📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Telugu News: Crime News- విద్యార్థుల కంట్లో కారం చల్లి.. హింసించిన టీచర్ సస్పెండ్

Author Icon By Pooja
Updated: August 25, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Crime news: టీచర్(Teacher) అంటే తల్లిదండ్రుల తర్వాత రెండవ గురువులు. పిల్లలకు నేర్పే విద్యాబుద్ధులతో పాటు వారి క్రమశిక్షణ జీవితం,  ఉజ్వల భవితకు బాటలు వేస్తారు. విద్యార్థులు ఆశించిన ప్రగతిని సాధిస్తే అందులో మొదటగా గర్వించేది, ఆనందపడేది గురువే. ఇంతటి బాధ్యతగల ఉపాధ్యాయుడు పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఫలితంగా సస్పెండ్ కు గురయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కంట్లో కారం చల్లి, ఆపై హింస

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఖుద్వాన్ పూర్(Khudwanpur) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కళ్లలో కారం పోసాడు ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుడి పేరు శంకర్. శంకర్ అంతటితో ఆగకుండా వారిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. పిల్లల కళ్లలో కారం చల్లడంతో విద్యార్థులు మంటకు తాళలేక, గగ్గోలుపెట్టి ఏడ్చారు. వారిని క్రమశిక్షణ పెట్టాలని ఆపై వారిని విచక్షణారహితంగా చితకబాదాడు. ఇంటికి వెళ్లి విద్యార్థులు జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు తెలపడంతో ఉ పాధ్యాయుడిపై దాడి చేసేందుకు వారు పాఠశాలకు వచ్చారు. అయితే ముందుగానే ఈ సమచారం తెలుసుకున్న సదురు ఉ పాధ్యాయుడు శంకర్ అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో చేసేది లేక తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాలికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ప్రిన్సిపాల్ విద్యార్థులను హింసించిన ఘటనను ఉన్నతాధికారులకు తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఉపాధ్యాయుడు శంకర్ ను సస్పెండ్ చేశారు.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఖుద్వాన్ పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.

విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఎవరు?
విద్యార్థుల కళ్లలో కారం చల్లి, వారిని కొట్టిన ఉపాధ్యాయుడు పేరు శంకర్.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-crime-news-husbands-cruelty-for-dowry/telangana/535640/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.