Crime News: పిల్లలపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి బిడ్డల్ని చదివిస్తారు. వారు తమను ఏదో ఉద్దరిస్తారే భావన నేటి ఆధునిక తల్లిదండ్రులకు లేదు. వారి బతుకు వారు హాయిగా ఉంటే చాలనుకుంటున్నారు. స్మార్ట్ఫోన్లు చేతిలో పడ్డాక పిల్లల్లో క్రమశిక్షణ తగ్గిపోతున్నది. వారి ఆలోచనావిధానాలను, సమస్యలను తల్లిదండ్రులతో కంటే స్నేహితులతోనే పంచుకుంటున్నారు. లేతవయసులోనే ప్రేమలు అంటూ హద్దులు దాటుతున్నారు. పాఠశాల వయసులోనే తామేదో పెద్దవారం అయిపోయామనే భావనతో పెద్దలు సైతం ఊహించని పనులు చేస్తున్నారు. ఎందుకు ఇదంతా చెబుతున్నానని అనుకుంటున్నారా? స్కూలుకు వెళ్లి బుద్ధిగా చదువుకోవాల్సిన బాలిక ఏకంగా గర్భం దాల్చి, వాష్రూమ్లో బిడ్డకు జన్మనిస్తే ఏం చేయాలి? ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక
కర్ణాటకలోని(Karnataka) యాద్గిర్ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పాఠశాల వాష్రూమ్ లో మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలిక, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ప్రస్తుతం వీరు షాహాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి, పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బందిపై సుమోటో కేసు నమోదు చేసి, దర్యాప్తునకు ఆదేశించారు. నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్పందించిన రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్
బుధవారం బాలిక బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ, ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఫిర్యాదు చేసిన తర్వాత నివేదిక సమర్పించాలని కర్ణాటక రాష్ట్ర బాలల హకుక్కల పరిరక్షణ కమిషన్ సభ్యుడు శశిధర్ కోసాంబే అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురాలేదని పేర్కొంటూ, పాఠశాల ప్రిన్సిపాల్స్, ఇతర సిబ్బందిపై సుమోటోగా ఫిర్యాదు నమోదు చేస్తామని కోసాంబే పేర్కొన్నారు.
ఘటనపై స్పందించిన ప్రిన్సిపాల్
కాగా పాఠశాల ప్రిన్సిపాల్(Principal) బనమ్మ మాట్లాడుతూ, తాను గత నెలలోనే ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించానని చెప్పారు. ఆ అమ్మాయి బర్త్ సర్టిఫికెట్లో ఆమె వయసు 17 సంవత్సరాల 8నెలల అని ఉందని చెప్పారు. అలాగే, విద్యార్థిని గర్భం గురించి ఎటువంటి లక్షణాలు తనకు కనిపించలేదని చెప్పారు. జూన్లో స్కూల్ ప్రారంభమైనప్పటటి నుండి ఆ బాలిక చాలారోజులుగా స్కూలు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. బాలిక ఈనెల 5వ తేదీ నుంచి మాత్రమే స్కూల్కి హాజరు అవుతున్నట్లు చెప్పారు. బాలిక అనారోగ్య కారణాల వల్ల చాలారోజులు స్కూలు రావడం లేదని, ఆమె బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసి తాము ఆశ్చర్యపోయామని చెప్పారు. దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని ప్రిన్సిపల్ బసమ్మ చెప్పారు. ఏదిఏమైనా పిల్లలపట్ల తల్లిదండ్రులతో పాటు పాఠశాల సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకంగా తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రవర్తనలోనూ, శారీరక మార్పుల్లోనూ క్షుణ్ణంగా గమనిస్తూ ఉండాలి. వారు ఎవరితో గడుపుతున్నారు? సెల్ఫోన్లలో వాటిని చూస్తున్నారో కూడా నిరంతర పర్యవేక్షణ అవసరం. లేకపోతే వారి జీవితాలను మనమే పాడుచేసిన వారంగా ఉంటాం.
ప్రిన్సిపాల్ ఈ విషయంపై ఏమన్నారు?
బాలిక గర్భం దాల్చినట్లు ఎటువంటి లక్షణాలు గమనించలేదని, బాలిక జూన్ నుండి తరచుగా స్కూల్‌కు రాలేదని, ఆగస్టు 5 నుండి మాత్రమే హాజరైందని ప్రిన్సిపాల్ తెలిపారు.
తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఏ విషయంపై అప్రమత్తంగా ఉండాలి?
పిల్లల ప్రవర్తన, శారీరక మార్పులు, సెల్‌ఫోన్ వినియోగం, స్నేహితులతో గడిపే సమయం వంటి అంశాలను జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: