తమిళనాడులోని కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన(Telangana Crime) అయ్యప్ప భక్తులైన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన పాలకుర్తి సత్యనారాయణ (63), రమాదేవి (59) అయ్యప్ప మాలధారణతో శబరిమల యాత్రకు వెళ్లారు.
Read Also: Guntur crime: వేరే వ్యక్తితో భార్య ఎఫైర్.. భర్త ఆత్మహత్య!
జనవరి 8న బయలుదేరిన ఈ దంపతులు, జనవరి 15న మకర సంక్రాంతి రోజున స్వామి దర్శనం పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఈ క్రమంలో(Telangana Crime) కన్యాకుమారి బైపాస్ రోడ్డులో బస్సు దిగిన వారు సముద్ర స్నానం చేసి, సమీప దేవాలయాలను దర్శించారు. అనంతరం మళ్లీ బస్సు వద్దకు వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కసారిగా జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: