Tamilnadu Crime: కృష్ణగిరి జిల్లాలో జరిగిన ఓ శిశు మరణం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఐదు నెలల పసిబిడ్డ మరణంపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు, తల్లి భారతి మరియు ఆమె స్నేహితురాలు సుమిత్రను అరెస్ట్ చేశారు. ఈ ఘటన నవంబర్ 5న చిన్నతి గ్రామంలో చోటుచేసుకుంది.
మొదట సహజ మరణమని భావించిన కుటుంబం
తండ్రి సురేష్ తెలిపిన ప్రకారం, బాలుడు పాలు తాగుతుండగా అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే బిడ్డ మృతి చెందిందని నిర్ధారించారు. ప్రారంభంలో కుటుంబ సభ్యులు ఈ మరణం సహజ కారణాల వల్ల జరిగిందని భావించారు.
Read Also: AP Crime: ఉద్యోగం రాలేదని మనోవేదన తో యువకుడు ఆత్మహత్య
తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు మలుపు
కానీ తండ్రి సురేష్ తన భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. భారతి ఫోన్‌లో కొన్ని అనుమానాస్పద ఫోటోలు, వాయిస్ మెసేజ్‌లు గమనించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో భారతి మరియు ఆమె స్నేహితురాలు సుమిత్ర మధ్య ఉన్న సన్నిహిత సంబంధం, అలాగే శిశువు మరణంలో వారి ప్రమేయం ఉందని పేర్కొన్నాడు.
దర్యాప్తు కొనసాగుతోంది
Tamilnadu Crime: పోలీసులు ఇప్పటికే ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. సురేష్ అందించిన ఆధారాలను ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: