📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Tamil Nadu Woman Acid Death: పండ్ల రసం అనుకుని యాసిడ్ తాగిన యువతి.. అసలేం జరిగింది?

Author Icon By Anusha
Updated: March 20, 2026 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tamil Nadu Woman Acid Death: తమిళనాడులోని అష్టంపట్టి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కేవలం ఒక సీసాను సరిగ్గా గుర్తించకపోవడం వల్ల ఒక కుటుంబం ఛిన్నాభిన్నమైంది.

Read Also: Kerala Assembly Elections: కేరళ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

అసలేం జరిగింది?

అష్టంపట్టి పిళ్ళయార్ నగర్‌కు చెందిన దివ్య భారతి (31) తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటిలో నివసిస్తోంది. ఆమె భర్త సెంథిల్ తిరుప్పూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు.ఈ క్రమంలో ఇల్లు శుభ్రం చేయడం కోసం ఆమె తల్లిదండ్రులు వంటగదిలో ఒక సీసాలో యాసిడ్‌ను భద్రపరిచారు. దురదృష్టవశాత్తూ, ఆ సీసాలో ఉన్నది పండ్ల రసం అని దివ్య భారతి పొరబడింది. ఏమరపాటుతో ఆ యాసిడ్‌ను తాగేయడంతో కొద్దిసేపటికే ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. పరిస్థితి విషమించడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tamil Nadu Woman Acid Death: A young woman drank acid thinking it was fruit juice.. What really happened?

ఆసుపత్రిలో చేరిన దివ్య భారతికి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, యాసిడ్ ప్రభావం శరీర అంతర్గత అవయవాలపై తీవ్రంగా ఉండటంతో ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఈ వార్త విన్న భర్త సెంథిల్, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇద్దరు చిన్న పిల్లలు తల్లి కోసం ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. మృతిపై సమాచారం అందుకున్న అష్టంపట్టి పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భర్త సెంథిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Divya Bharathi Acid Case Mistaking Acid for Juice Incident Salem Ashtampatti News Tamil Nadu Woman Acid Death

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.