📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Tamil Nadu: సాంబారులో విషం కలిపి భర్తను హతమార్చిన భార్య

Author Icon By Anusha
Updated: July 21, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెళ్లి, పిల్లలు, శాంతియుత జీవితం, ఇవన్నీ ఉన్నా ఓ మహిళ భర్తను హత్య చేయడమే కాకుండా, ఆ కుట్ర వెనుక ప్రేమికుడి భాగస్వామ్యం కూడా ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో చోటుచేసుకుంది.ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్ (35) ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి అమ్ముబీ అనే మహిళతో వివాహం కాగా, ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు – ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఇద్దరూ సాదాసీదాగా జీవితం సాగిస్తున్నట్టు కనిపించినా, ఆ ఇంట్లో పెనుముప్పు దాగి ఉంది.అమ్ముబీ ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకునేది. ఈ క్రమంలో ఆమె జీవితంలో లోకేశ్వరన్ అనే వ్యక్తి ప్రవేశించాడు. అతను అదే ఊరిలో సెలూన్ నడుపుతూ ఉంటాడు. వీరి మధ్య అర్థం కాని బంధం ఏర్పడింది. ఆ బంధం ప్రేమగా మారింది.

హుటాహుటిన ఆసుపత్రికి

భర్త రసూల్ తమ ప్రేమకు అడ్డుగా ఉంటున్నాడని భావించిన అమ్ముబీ అతన్ని తొలగించాలనుకుంది.తన ప్రియుడితో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది. మొదటగా లోకేశ్వరన్ ఇచ్చిన విషాన్ని దానిమ్మరసంలో కలిపి రసూల్‌ (Rasul) కు ఇవ్వాలనుకుంది. కానీ అతను తాగలేదు. తరువాత అది సాంబారులో కలిపింది. ఆ విషసాంబారం తిన్న రసూల్‌కి వాంతులు వచ్చాయి, స్పృహ కోల్పోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా, రక్తపరీక్షల్లో పురుగుమందు అవశేషాలు ఉన్నట్టు తేలింది.ఈ విషయాన్ని వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో రసూల్‌ కుటుంబీకులు ఒక్కసారిగా షాకయ్యారు, ఆయన భార్య అమ్మూబీపై అనుమానంతో ఆమెను అడిగారు.. ఆమె ఏవేవో పొంతన లేని విషయాలను చెప్పింది. దీంతో ఆమె సెల్‌ఫోన్‌లోని వాట్సప్‌ చాటింగ్‌‌ను పరిశీలించారు.

Tamil Nadu: సాంబారులో విషం కలిపి భర్తను హతమార్చిన భార్య

ఆసుపత్రిలో చికిత్స

దీంతో అసలు విషయం వెలుగుచూసింది.అమ్మూబీ స్థానికంగా సెలూన్‌ నడుపుతున్న లోకేశ్వరన్‌తో చాట్‌ చేసినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. అందులో నువ్వు ఇచ్చిన విషాన్ని మొదట దానిమ్మ రసంలో కలిపా దాన్ని నా భర్త తాగలేదు దీంతో ఆహారంలో కలిపా, అంటూ అమ్ముబీ పేర్కొంది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రసూల్‌ మృతి చెందడంతో.. కుటుంసభ్యులు అతని భార్య, ప్రియుడిపై ఫిర్యాదు చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అమ్ముబీ, లోకేశ్వరన్‌ (Lokeshwaran) లను శనివారం అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

తమిళనాడు ఎందుకు ప్రఖ్యాతి పొందింది?

తమిళనాడు అనేది భారతదేశంలో అత్యంత సాంస్కృతిక వారసత్వం కలిగిన రాష్ట్రాలలో ఒకటి. ఇది పూర్వ ప్రాచీన దేవాలయాలు, సంప్రదాయ కళలు, ఉత్సవాలు, చరిత్రపరమైన శిల్పకళతో ప్రసిద్ధి పొందింది.

తమిళనాడులో మొత్తం ఎన్ని నగరాలు ఉన్నాయి?

తమిళనాడులో 17 మునిసిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి, ఇవే ప్రధాన నగరాలుగా పరిగణించబడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Odisha: ఒడిశాలో దారుణం.. బాలికను సజీవదహనం చేసేందుకు యత్నించిన దుండగులు

Ammubi arrest Arur Tamil Nadu Breaking News husband poisoning Keeraipatti village latest news Lokeshwaran affair poisoning case Rasool death Tamil Nadu crime Tamil Nadu murder Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.