📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Tamilnadu: చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడిని విడుదల చేసిన ఉన్నత ధర్మాసనం

Author Icon By Anusha
Updated: October 9, 2025 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాట (Tamilnadu) 2017లో సంచలనం రేపిన ఆరేళ్ల బాలిక హాసినిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు తాజాగా మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో నిందితుడిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) తీసుకున్న తాజా తీర్పు పెద్ద దుమారం రేపింది. సుప్రీంకోర్టు ఈ నిర్ణయంలో కీలక అంశాలను ప్రస్తావించింది. నిందితుడిపై విచారణ సమయంలో పోలీసులు సరైన ఆధారాలు సేకరించలేదని, దర్యాప్తు పద్ధతిలో తీవ్ర లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.

Telangana Villages: ములుగు జిల్లాలోని 8 గ్రామాలకు కేంద్రం భారీ నజరానా

పైగా ఈ కేసులో నిందితుడిని పోలీసులు బలి పశువును చేశారని.. విచారణ ఏకపక్షంగా జరిగిందని తెలిపింది. నిందితుడికి తనను తాను రక్షించుకునే హక్కుందని.. రాజ్యాంగమే దీన్ని కల్పించిందని చెప్పుకొచ్చింది.

ఈ హక్కుకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత న్యాయస్థానంతో పాటుగా ప్రభుత్వానికి కూడా ఉందని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది.కేసు వివరాలకు వస్తే.. తమిళనాడు (Tamilnadu), కుండ్రత్తూరుకు చెందిన దశ్వంత్ ‌.. 2017లో చెన్నై మౌలివాక్కానికి చెందిన ఆరేళ్ల బాలిక హాసినిపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశాడు.

దిగువ కోర్టు తీర్పుపై దశ్వంత్

ఈ కేసులో జైలుకెళ్లి.. బెయిల్ మీద బయటకు వచ్చిన దశ్వంత్ (Dashwant) ఆ తర్వాత బాలిక తల్లిని కూడా హత్య చేశాడని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దిగువ కోర్టు దశ్వంత్‌కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.అయితే దిగువ కోర్టు తీర్పుపై దశ్వంత్.. హైకోర్టును ఆశ్రయించాడు.

అక్కడ అతడికి చుక్కెదురైంది. దిగువ కోర్టు తీర్పును మద్రాస్ హైకోర్టు కూడా సమర్థించింది. దీన్ని సవాల్‌ చేస్తూ 2018లో నిందితుడు దశ్వంత్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈక్రమంలో బుధవారం నాడు జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్‌ విక్రమ్‌ సేథ్, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ల ధర్మాసనం విచారణ జరిపింది.

 Tamilnadu

పరిస్థితులను వివరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని

ఈక్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ కేసు విచారణలో భాగంగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక (FSL report) లతో పాటుగా ఇతర ముఖ్యమైన పరిస్థితులను వివరించడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమైందని ధర్మాసనం పేర్కొంది. కోర్టు.. పిటిషనర్‌ను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో వచ్చిన ఆరోపణలకు సంబంధించిన పత్రాలను నిందితుడికి అందించలేదని తెలిపింది.

మరణ శిక్ష విధించే కేసులో.. రాజ్యాంగం ఇలాంటి పత్రాలను తప్పనిసరి చేసిందని ధర్మాసనంన తన తీర్పులో పేర్కొంది.నిందితుడికి తనను తాను కాపాడుకునే హక్కు ఉందని.. ఇందుకు అవకాశం కల్పించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

2018, ఫిబ్రవరి 19వ తేదీన దశ్వంత్‌ని దోషిగా నిర్ధారించి కోర్టు.. అదే రోజు అతడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునివ్వడాన్ని ప్రస్తావించిన ధర్మాసనం.. ఇందుకు కోర్టు అనవసర ఉత్సాహం చూపిందని అభిప్రాయపడింది.

ఈ కేసులో దిగువ కోర్టు, మద్రాస్‌ హైకోర్టు (Madras High Court) వెల్లడించిన తీర్పులను పక్కనబెడుతున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితుడి మీద వేరే ఇతర కేసులు ఏవి లేకపోతే.. అతడిని జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా ధర్మాసనం అధికారులను ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Dashwant Hasini murder case latest news Supreme Court Tamil Nadu case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.