📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Tamil Nadu Crime: విషాదం.. ట్యాబ్లెట్ గొంతులో ఇరుక్కుని మరణించిన పసిబాలుడు

Author Icon By Anusha
Updated: August 19, 2025 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి ప్రాంతంలో ఓ చిన్నారి మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. నాలుగేళ్ల వయసు గల బాలుడు యోగిత్ గొంతులో మాత్ర ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆ గ్రామం మొత్తం దుఃఖసంద్రంలో మునిగిపోయింది.వివరాల్లోకి వెళ్తే – తిరువళ్లూరు జిల్లా (Thiruvallur District) తిరుత్తణి యూనియన్‌లోని పి.ఆర్.పల్లి గ్రామానికి చెందిన వేలు, ఆయన భార్య శశికళ దుస్తులు నేసి జీవనోపాధి సాగిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు యోగిత్ ఉన్నాడు. ఇటీవల చిన్నారికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మందులు, మాత్రలు రాశారు. వైద్యుల సూచన మేరకు శశికళ తన కుమారుడికి మందు ఇవ్వడానికి ప్రయత్నించింది.

వైద్యులు బాలుడిని పరీక్షించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు

అయితే ఊహించని విధంగా ఆ మాత్ర బాలుడు గొంతులో ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా శ్వాస ఆడక చిన్నారి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.అక్కడ వైద్యులు బాలుడిని పరీక్షించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ (Intensive care unit) లో చేర్చారు. ఈ క్రమంలోనే యోగిత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు కుటుంబానికి ధైర్యం చెప్పడానికి చేరుకున్నారు.ఈ సంఘటనతో యోగిత్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి ఆవేదన చూపరులను కంటతడి పెట్టించింది. ఈ సంఘటనపై తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tamil Nadu Crime

ఒక నిర్దిష్ట వయస్సు వరకు పిల్లలకు నేరుగా టాబ్లెట్ ఇవ్వకూడదని

పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించి పిల్లలకు మందులు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని పిల్లల ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఏ కారణం చేతనైనా, ఒక నిర్దిష్ట వయస్సు వరకు పిల్లలకు నేరుగా టాబ్లెట్ ఇవ్వకూడదని పేర్కొంటున్నారు. మీరు ఇవ్వాలనుకుంటే.. దానిని పాలు, రసం లేదా నీటిలో కలిపి ఇవ్వవచ్చు.. లేదా మీరు దానిని రెండుగా విడగొట్టి ఇవ్వాలి.. తల్లిదండ్రులు కూడా పిల్లవాడు టాబ్లెట్‌ను పూర్తిగా మింగాడా లేదా చూసుకోవాలి. కొన్నిసార్లు అది గొంతులో ఇరుక్కుపోవచ్చు. కాబట్టి, టాబ్లెట్ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ నీరు తాగించాలని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/kukatpally-crime-madhavaram-krishna-rao-visits-the-family-of-the-murdered-child/crime/532387/

4 year old boy death Breaking News child dies while taking medicine latest news tablet stuck in throat Tamil Nadu News tiruttani incident tiruvallur tragedy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.