📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Telugu News: Tamil Nadu Crime: మరో మహిళతో ప్రేమ.. 5 నెలల పసివాడిని హతమార్చిన తల్లి

Author Icon By Tejaswini Y
Updated: November 8, 2025 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు(Tamil Nadu Crime) రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హోసూర్‌లో ఓ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. మరో మహిళతో ప్రేమలో పడ్డ ఓ తల్లి, తన ఐదు నెలల పసివాడిని అమానుషంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. భర్త అనుమానం వ్యక్తం చేసి మొబైల్‌ ఫోన్‌ పరిశీలించడంతో ఈ ఘోర రహస్యం వెలుగులోకి వచ్చింది.

సమాజంలో తరచూ అక్రమ సంబంధాల కోసం కుటుంబాలను, కన్నబిడ్డలను బలి చేసే ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ సంఘటన అందులో అత్యంత భయంకరమైనదిగా మారింది. మరో మహిళతో అనుచిత సంబంధం పెట్టుకున్న ఓ తల్లి, ఆ ప్రేమ కోసం తన స్వంత పసివాడినే హతమార్చడం రాక్షసత్వానికి నిదర్శనంగా నిలిచింది.

Read Also: HDFC: లోన్లు తీసుకున్నవారికి శుభవార్త చెప్పిన హెచ్ డిఎఫ్ సి

ఘటన వెనుక ఉన్న నిజాలు

కెలమంగళం సమీపంలోని చిన్నట్టి గ్రామానికి చెందిన సురేష్‌, భారతి దంపతులు ఆరు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం ఇద్దరు కుమార్తెలు, ఒక ఐదు నెలల పసివాడు ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆ పసివాడు మృతి చెందగా, “పాలు ఇస్తుండగా ఊపిరాడక చనిపోయాడు” అని భారతి తెలిపింది. కుటుంబ సభ్యులు కూడా అది సహజ మరణమని నమ్మి అంత్యక్రియలు నిర్వహించారు. భారతి ప్రవర్తనలో మార్పు గమనించిన భర్త సురేష్‌ ఆమె మొబైల్‌ చెక్‌ చేయగా, అందులో ఉన్న ఫొటోలు చూసి షాక్‌ అయ్యాడు. భారతి మరో మహిళ అయిన సుమిత్రతో ప్రేమలో ఉందని, ఇద్దరి మధ్య స్వలింగ సంబంధం కొనసాగుతోందని అతడికి తెలిసింది. దీంతో పసివాడి మరణంపై అతనికి అనుమానం కలిగి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు బయటపెట్టిన షాకింగ్ విషయాలు

దర్యాప్తులో భారతి, సుమిత్రల మధ్య ఉన్న సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. సురేష్‌తో తగాదా తర్వాత భారతి కొంతకాలం తన పుట్టింట్లో ఉండగా, తరువాత కుటుంబ పెద్దల సర్దుబాటుతో తిరిగి భర్త ఇంటికి వచ్చింది. కానీ రెండు రోజుల క్రితం భర్త, కుటుంబ సభ్యులు బయట ఉన్న సమయంలో భారతి తన పసివాడికి ఊపిరాడకుండా చేసి చంపినట్లు విచారణలో వెల్లడైంది. ఇది సుమిత్ర సూచన మేరకే జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో భారతి, సుమిత్రలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పసివాడి మృతదేహాన్ని వెలికి తీసి మళ్లీ పరిశీలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, భయాన్ని కలిగించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

CrimeNews CrimeStory HosurIncident LesbianRelationship MotherKillsBaby TamilNaduCrime TamilNaduNews Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.